Viral News: పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన.. ఉల్లి, వెల్లుల్లి.. 23 ఏళ్ల బంధానికి స్వస్థి!
సాధారణంగా ఇద్దరు భార్య భర్తల విడిపోవడానికి కారణాలు ఏమి ఉంటాయి. గోడవలు, లేదా వివాహేతర సంబంధాలు. కానీ ఇక్కడ మాత్రం ఉల్లిపాయ, వెల్లుల్లి కారణంగా ఇద్దరు భార్య భర్తలు విడిపోవాల్సి వచ్చింది. ఇదే విషయంపై వాళ్లు కోరుకెళ్లగా.. కోర్టు కూడా అందుకు సమర్థించి వాళ్ల 20 ఏళ్ల వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెడుతూ విడాకులు మంజూరు చేసింది. ఇంతకు ఆ పచ్చని కాపురంలో ఉల్లిపాయ, వెల్లుల్లి పెట్టిన చిచ్చేంటో తెలుసుకుందాం పదండి.

వంట గదిలో ఉండే రెండు పదార్థాలు.. ఇదరు భార్యభర్తలు విడిపోవడానికి కారణమయ్యాయంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే ఎందుకుంటే.. ఇది గుజరాత్ రాష్ట్రంలో నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈ రెండు పదార్థాలప కోసం వంట గదిలో మొదలైన గొడవ.. ఆ భార్యభర్తల 23 ఏళ్ల వివాహ బంధానికి మిగింపు పలకడంతో సద్దుమణిగింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. 2002లో పెళ్లి బంధంతో ఓ జంట ఒక్కటైంది. అయితే భార్య స్వామి నారయణ్ భక్తురాలు కావడంతో.. మత నిబంధనల ప్రకారం.. ఆమె, ఉల్లిపాయ, వెళ్లుల్లికి దూరంగా ఉంటుంది. అవి లేకుండానే వంటలు చేసేంది. పెళ్లైన కొన్ని రోజులు ఈ వంటాకాల విషయంలో ఎలాంటి గోడవలు లేక పోయినా.. కాలక్రమేనా అవి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాయి. దీంతో ఇంట్లో రెండు పొయ్యులు పుట్టుకొచ్చాయి. కొన్ని రోజులకు ఇంట్లో గొడవలు కూడా మొదలయ్యాయి. దీంతో భార్య తన బిడ్డను తీసుకొని ఇంట్లో నుంచి బయటకొచ్చింది.
దీంతో తను ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో భార్య నుంచి విడాకులు కావాలని భర్త 2013లో కోర్టుకు వెళ్లాడు. ఆహార పదార్థాల విషయంలో భార్య రాజీ పడకపోవడం క్రూరత్వమని ఆతని పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్ విచారణ జరిపిన ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం 2024లో వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే దీన్ని సావాల్ చేస్తూ భార్య గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. మతపరమైన ఆహార నియమాలను భర్త పట్టించుకోలేదని.. భార్య తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై భర్త స్పందిస్తూ.. తనకు సపరేట్‌గా ఉల్లి, వెల్లుల్లి లేని వంటకాలు వండిపెట్టినా.. ఆమె వైఖరి మారలేదని తెలిపారు. అయితే కాసేపటి తర్వాత భార్య ఊహించని విదంగా తాను కూడా విడాకులను వ్యతిరేకంచట్లేదని చెప్పడంతో.. ఇద్దరి విడాకులు దృవీకరిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. భార్యకు భరణం చెల్లించాలని భర్తకు ఆదేశాలు జారీ చేసింది.. భర్త కూడా అందుకు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది.
వంటగదిలో రెండు పదార్థాల విషయంలో మొదలైన చిన్న గోడవ ఏకంగా రెండు కుటుంబాలనే విడదీసింది. ఒక బిడ్డకు తండ్రిని దూరం చేసింది. ఇద్దరి భార్య భర్త 23 ఏళ్ల వైవాహిక బందానికి ముగింపు పలికింది. ఆ రోజు కోర్టులో జరిగిన వాదనలు అందరి మనులను కదిలించాయి. చిన్న చిన్న విషయాలకు భార్య భర్తలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆలోచించేలా చేశాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
