Funny Video: ఇదేం తమాషా బాబు..! పెళ్లిరోజు వరుడికి సాస్‌తో తలంటు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Video: వివాహం అనేది జీవితంలో జరిగే అతి పెద్ద వేడుక. అందుకే చాలా గొప్పగా నిర్వహిస్తారు. బంధువులను, స్నేహితులను ఆహ్వానిస్తారు.

Funny Video: ఇదేం తమాషా బాబు..! పెళ్లిరోజు వరుడికి సాస్‌తో తలంటు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Video

Edited By: Ravi Kiran

Updated on: Oct 07, 2021 | 6:28 AM

Funny Video: వివాహం అనేది జీవితంలో జరిగే అతి పెద్ద వేడుక. అందుకే చాలా గొప్పగా నిర్వహిస్తారు. బంధువులను, స్నేహితులను ఆహ్వానిస్తారు. రకరకాల విందుభోజనాలు వడ్డిస్తారు. ప్రతి ఒక్కరికి తన వివాహ వేడుక గుర్తుండిపోవాలని భావిస్తారు. ఇండియాలో వివాహం అనేది చాలా సంప్రదాయంగా జరుగుతుంది. ఒక పద్దతి ప్రకారం నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఎన్నో మధురమైన సంఘటనలు జరుగుతుంటాయి. వధూవరులను ఆటపట్టించడం కూడా ఉంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి వివాహం రోజున స్నేహితులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. వీడియోలో వరుడు స్నానానికి సిద్దమవుతుండటం మనం గమనించవచ్చు. కానీ ఒక్కసారిగా అతడి స్నేహితులు వచ్చి అతడిని ఆగమాగం చేస్తారు. పసుపు వేయాలని చెప్పి అతడి కుర్తాను బలవంతంగాద చింపి వేస్తారు. తర్వాత పసుపుకు బదులు మయోన్నైస్‌, సాస్‌, పువ్వులు శరీరం మొత్తం వేసి ఆటపట్టిస్తారు. అయినా కానీ వరుడు నవ్వుతూ అలాగే కూర్చుండటం మనం వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియో చూసిన తర్వాత నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. స్నానం ఇలా కూడా చేస్తారా బాబు అంటూ ముక్కున వేలేసుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రజలు ఈ వీడియోను తెగ చూసేస్తున్నారు. కామెంట్స్, షేర్స్‌ చేస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇలా కామెంట్ చేశాడు. పెళ్లి రోజున తన స్నేహితుడితో ఎవరైనా ఇలా చేస్తారా.. అన్నాడు. మరొకరు ఈ ఫ్రెండ్స్‌ ఎప్పటికీ బాగుపడరు అని రాశారు. ఏది ఏమైనప్పటికీ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం తెగ నవ్వుకుంటున్నారు.

Kolleru Pollution: గతమెంతో ఘనం.. ప్రస్తుతం గరళ మయం.. ఇదీ ఏపీలోని కొల్లేరు దుస్థితి..