Viral Video: పాపం! వరుడ్ని చెడుగుడు ఆడుకున్న స్నేహితులు.. వీడియో చూస్తే కడపుబ్బా నవ్వుతారు!
Viral Video: పెళ్లిళ్లలో జరిగే ఫంక్షన్‌లన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేయడం..
పెళ్లిళ్లలో జరిగే ఫంక్షన్‌లన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేయడం, స్నేహితుల ముచ్చట్లు.. బంధువుల కోలాహలం.. ఇలా ఒకటేమిటి పెళ్లంటేనే ఫుల్ ఎంజాయ్‌మెంట్. ఇందుకు సంబంధించిన పలు ఫన్నీ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిని చూశాక మీరు నవ్వాపుకోలేరు. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, పెళ్లి వేదికపై ఏర్పాటు చేసిన సోఫా మీద వరుడి ముగ్గురు స్నేహితులు హాయిగా కూర్చోవడం మీరు చూడవచ్చు. టిప్పు టాపుగా కళ్లజోళ్లు పెట్టుకుని ఫోటోకి పోజులు ఇచ్చారు. పాపం వరుడిని చెడుగుడు ఆడుకుని వెనకాల నిల్చోబెట్టారు. ఇక వీడియోలో వరుడి రియాక్షన్స్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
View this post on Instagram
కాగా, ఈ వీడియోను ‘official_viralclips’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేసింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ‘పెళ్లి రోజున వరుడికి ఎంత కష్టమొచ్చింది’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఏం చేసినా కూడా ఈ స్నేహితులు మారారు’ అని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.
Also Read: సోఫాలో నుంచి వింత శబ్దాలు.. భయం భయంగా పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!