కారులో తరలిస్తున్న ఖ‌రీదైన వ‌జ్రాలు, న‌గ‌లు సీజ్ చేసిన ఈసీ.. వాటి విలువెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

|

Nov 02, 2024 | 5:23 PM

టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు కళ్లు బైర్లే కమ్మే దృశ్యాలు కనిపించాయి. ఓ కారులో విలువైన ఆభరణాలు గుర్తించారు. కారులో లభ్యమైన వజ్రాలు, బంగారం, వెండి నగల విలువ కోట్లలో ఉంటుందని తెలిసింది. అయితే, సంబంధించిన బిల్లులు ఆభరణాల విలువకు సరిపోకపోవడంతో పోలీసులు వాటిని సీజ్‌ చేశారు. తదుపరి విచారణ కోస ఆదాయపు పన్నుశాఖకు బదిలీ చేశారు.

కారులో తరలిస్తున్న ఖ‌రీదైన వ‌జ్రాలు, న‌గ‌లు సీజ్ చేసిన ఈసీ.. వాటి విలువెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
Diamonds Jewels
Follow us on

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో పోలీసులు, ఎన్నికల అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నవంబర్‌ 2 శనివారం రోజున అహల్యనగర్ జిల్లాలోని టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు కళ్లు బైర్లే కమ్మే దృశ్యాలు కనిపించాయి. ఓ కారులో విలువైన ఆభరణాలు గుర్తించారు. కారులో లభ్యమైన వజ్రాలు, బంగారం, వెండి నగల విలువ దాదాపు రూ.24 కోట్లు అని అధికారులు తెలిపారు. వాటికి సంబంధించిన బిల్లులు ఆభరణాల విలువకు సరిపోకపోవడంతో పోలీసులు వాటిని సీజ్‌ చేశారు. తదుపరి విచారణ కోస ఆదాయపు పన్నుశాఖకు బదిలీ చేశారు.

నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మహారాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎస్‌టీలు మోహరించారు. ప్రతి కారు, బైకును వదలకుండా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న ఓ కారులో వజ్రాలు, బంగారం, వెండి ఆభరణాలు గుర్తించి సీజ్‌ చేశారు. ఈ ముగ్గురూ దక్షిణ ముంబైలోని జవేరీ బజార్ నుండి ఈ నగలు తీసుకువస్తున్నట్టుగా చెప్పారు. కాగా, ఎస్‌ఎస్‌టీ బృందం రసీదు చూపించమని కోరింది. కానీ, వారు చూపించిన రశీదులు, పట్టుబడిన నగలకు సరిపోకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

అయితే, ఈ ముగ్గురు ఛ‌త్ర‌ప‌తి సాంబాజిన‌గ‌ర్‌, అహ‌ల్య‌న‌గ‌ర్‌, జ‌ల్గావ్ జిల్లాల్లో ఆ ఆభ‌ర‌ణాల‌ను డెలివ‌రీ చేయాల్సి ఉంద‌న్నారు. అయితే, విలువైన వస్తువుల రవాణాకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫతేచంద్ రాంకా తెలిపారు. పోలీసులు ఆభరణాలు డిపాజిట్ చేసే ముందు నగల వ్యాపారులను పిలిచి ఉండాలని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..