Shocking: ఈ మేకకు ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా.. తాటిచెట్టును ఇంత ఈజీగా ఎక్కేస్తోంది..

|

Jan 06, 2023 | 7:51 PM

సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. దాదాపు అన్నీ కామెడీ వీడియోలే ఎక్కువగా ఉంటాయి. ఇక వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన వీడియోల గురించి అయిన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Shocking: ఈ మేకకు ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా.. తాటిచెట్టును ఇంత ఈజీగా ఎక్కేస్తోంది..
Goat Climbs Tree
Follow us on

సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. దాదాపు అన్నీ కామెడీ వీడియోలే ఎక్కువగా ఉంటాయి. ఇక వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన వీడియోల గురించి అయిన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అదో ప్రత్యేకమైన లోకం. జంతువుల జీవన శైలి, వాటి వేట, ఆట, అల్లరి ఇలా రకరకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. మరికొన్నిసార్లు సంచలనం సృష్టించే, మైండ్ బ్లాంక్ చేసే వీడియోలు కూడా సర్క్యూలేట్ అవుతుంటాయి. తాజాగా అలాంటి స్టన్నింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లన్నింటినీ షేక్ చేస్తోంది.

సాధారణంగా అయితే మేకలు భూమిపై మొలిచే గడ్డిని మేస్తుంది. కుదిరితే.. తనకు అందే చెట్ల తీగలను తింటుంది. కానీ, చెట్లు ఎక్కే సందర్భాలు అయితే చాలా తక్కువ. ఒకవేళ ఎక్కినా చిన్న చిన్న చెట్లను మాత్రమే ఎక్కుతాయి. మరి తాటి చెట్టును అమాంతం ఎక్కడం, అంతకంటే స్టైల్‌గా దిగడం ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు చూడండి. నిజంగా కళ్లు బైర్లు కమ్మేస్తాయి. మనుషులే ఏ సపోర్ట్ లేకుండా తాటిచెట్లను ఎక్కలేరు. కానీ, ఈ మేక మాత్రం సునాయాసంగా నడుచుకుంటూ చెట్టును ఎక్కేసింది. అంతేకాదండోయ్.. అంతకు మించిన స్టైల్‌తో కిందకు దిగింది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మేకపిల్ల.. ఈజీగా తాటి చెట్టు ఎక్కింది. మధ్యలోకి వెళ్లగానే ఏమనిపించిందో ఏమో గానీ.. వెంటనే వెనక్కి తిరిగింది. ఒక దిగేటప్పుడైతే రాజసం ప్రదర్శిస్తూ.. స్టైల్‌గా కిందకు దిగింది. అసలు మేక చెట్లు ఎక్కడమే గొప్ప అనుకుంటే.. ఇది ఏకంగా తాటిచెట్టు ఈజీగా ఎక్కడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ మేకు ఏమైనా అతీంద్రీయ శక్తులు ఉన్నాయా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..