Viral Video : కోడి కోసం గ్రద్దతో యుద్ధం చేసిన మేక.. చివరకు ఏమైందంటే.. వైరల్ అవుతున్న వీడియో

|

Sep 18, 2021 | 1:16 PM

స్మార్ట్ ఫోన్ చేతిలో ప్రపంచం అర చేతిలో ఉన్నట్టే.. భూమిమీద ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

Viral Video : కోడి కోసం గ్రద్దతో యుద్ధం చేసిన మేక.. చివరకు ఏమైందంటే.. వైరల్ అవుతున్న వీడియో
Goat
Follow us on

Viral Video : స్మార్ట్ ఫోన్ చేతిలో ప్రపంచం అర చేతిలో ఉన్నట్టే.. భూమిమీద ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అటు తిరిగి ఇటు తిరిగి నెట్టంట తెగ వైరల్ అవుతుంటాయి కొన్ని వీడియోలు. ఇక జంతువులకు సంబందించిన వీడియోలకు కొదవే ఉండదు. రకరకాల జంతువులకు సంబంధించిన వీడియోలు.. ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈ వీడియో కూడా అలాంటిదే.. మన స్నేహితుల జోలికి ఎవరైనా వస్తే ఊరుకుంటామా.. మనకు దెబ్బలు తగిలిన సరే వాళ్ళకోసం పోరాటం చేస్తాం. అలాగే జంతువులు కూడా తమ స్నేహితుల ప్రాణాలమీదకు వస్తే అస్సలు ఊరుకోవు .. అవతల ఉన్నది ఏదైనా సరే పోరాడతాయి. ఈ వీడియోలో ఓ కోడి కోసం మరో కోడి, ఓ మేక కలిసి గ్రద్దతో పోరాటం చేశాయి.

ఓ ఇంటిబయట ఉన్న కోడి మీదకు ఒక్కసారిగా ఆకాశం నుంచి ఎగురుతూ వచ్చి దాడి చేసింది గ్రద్ద. ఆ కోడిని ఎలాగైనా ఎత్తుకెళ్లాలని ప్రయత్నించింది. అయితే ఇంతలో అక్కడే ఉన్న మరో కోడి ఆ గ్రద్దతో ఫైట్‌కు దిగింది. ఎంత సేపటికి ఆ గ్రద్ద కోడిని వదలకపోవడంతో ఆ కోడి ఆర్తనాదాలు చేసింది. అది విన్న ఓ మేక అక్కడికి పరుగు పరుగున వచ్చి ఆ గ్రద్దతో యుద్దానికి దిగింది. ఆ రెండు కలిసి గ్రద్దనుంచి కోడిని కాపాడాయి. ఇక చేసేదేమి లేక గ్రద్ద కోడిని వదిలి వెళ్లిపోయింది. ఇలా ప్రాణాలు తెగించి ఓ కోడి కోసం మరో కోడి , మేక చేసిన పనికి నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తుంది. ఈ జంతువులను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ఇక్కడ చదవండి :