Viral Video: శత్రువుల నుంచి తనని తాను రక్షించుకునేందుకు రంగులు మార్చుకునే చేప.. నెట్టింట్లో వీడియో వైరల్..
విచిత్ర చేపకు సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీటిలో తమను తాము పూర్తిగా పారదర్శకంగా మార్చుకునే అలాంటి కొన్ని జీవులు ఉన్నాయి.
Viral Video: ప్రకృతి అనేక అద్భుతాలకు నెలవు. ఆకాశం, భూమి. సముద్రం ఇలా ప్రతి దానిలోనూ వింతలు విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా సముద్ర జీవుల ప్రపంచం మనకు ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అనేక రకాల సముద్ర జీవుల గురించి ఇంకా తెలియని విశేషాలు ఉన్నాయి. ఒక సముద్ర జీవి ఆక్సిజన్ లేకుండా జీవించగలదు. ఈ జీవి సైన్స్ కు సవాల్ గా నిలుస్తోంది. అలాంటి విచిత్ర చేపకు సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీటిలో తమను తాము పూర్తిగా పారదర్శకంగా మార్చుకునే అలాంటి కొన్ని జీవులు ఉన్నాయి. దీంతో ఈ జీవులను ఎవరూ వేటాడలేరు. ఈ వీడియోలో ఓ చేప నీటిలో నుండి బయటకు రాగానే పారదర్శకంగా మారుతుంది.
ఈ వైరల్ అవుతున్న వీడియోలో.. టబ్‌లో ఈత కొడుతున్న ఓ నల్ల చేపను చూడవచ్చు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ చేపను నీళ్ల నుండి బయటకు తీశాడు. చేప నీటి నుండి బయటకు వచ్చిన వెంటనే.. దాని రంగు వేగంగా మారుతుంది. అలా పూర్తిగా పారదర్శకంగా మారింది. చేప చాలా పారదర్శకంగా కనిపిస్తుంది. ఎంతగా అంటే.. ఈ చేపను చేతిలో పట్టుకున్న వ్యక్తి వేళ్లు కూడా కనిపిస్తున్నాయి. కొంచెం సేపు తర్వాత ఆ వ్యక్తి ఆ చేపను మళ్లీ నీటిలో ఉంచాడు. వెంటనే ఆ చేప మళ్లీ తన నల్ల రంగులోకి మారింది.
Glass squid that changes color instantly. pic.twitter.com/SCyRirE9cG
— Figen (@TheFigen) May 14, 2022
ఈ చేపలను గాజు స్క్విడ్ అని అంటారని తెలుస్తోంది. ఇవి మహాసముద్రాల ఉపరితలం, మధ్య నీటి లోతుల్లో కనిపిస్తాయి. ఈ చేపకు చెందిన ఈ వీడియో @TheFigen అనే ఖాతా ద్వారా Twitterలో షేర్ చేశారు. 41 లక్షల మందికి పైగా వీక్షించారు. అంతేకాదు.. గ్లాస్ స్క్విడ్ చేపలు.. భయానికి గురైనప్పుడు అవి మాంటిల్‌లోకి సిరాను విడుదల చేస్తుంది. తద్వారా ఈ చేపలు తమ రంగు మార్చుకోవడానికి సహాయపడతాయని నెటిజన్ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..