Viral Video: మానవత్వం అంటే ఇదే.. కష్టపడి మరి పిల్లి పిల్లను కాపాడిన అమ్మాయి.. ప్రశంసిస్తున్న నెటిజన్లు..

|

Aug 16, 2022 | 4:37 PM

Viral Video: సోషల్‌ మీడియాలో చాలా వీడియోలో ట్రెండింగ్‌ అవుతుంటాయి. ఎక్కువగా పాములు, మొసళ్లు, పులులు ఇలా రకరకాల జంతువుల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి...

Viral Video: మానవత్వం అంటే ఇదే.. కష్టపడి మరి పిల్లి పిల్లను కాపాడిన అమ్మాయి.. ప్రశంసిస్తున్న నెటిజన్లు..
Viral Video
Follow us on

Viral Video: సోషల్‌ మీడియాలో చాలా వీడియోలో ట్రెండింగ్‌ అవుతుంటాయి. ఎక్కువగా పాములు, మొసళ్లు, పులులు ఇలా రకరకాల జంతువుల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ మానవత్వానికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లో కొందరు జంతువులపై అమితమైన ప్రేమ చాటుకుంటారు. వాటిపై ఎనలేని మానవత్వం చూపిస్తుంటారు. వాటికి ఏమైనా జరిగిందంటే చాలు.. తమ ప్రాణాలు అడ్డుపెట్టి అయిన సరే వాటిని కాపాడుతుంటారు. అలాంటి వీడియోనే మీకు చూపించబోయేది. మానవత్వం అంటే ఇదే. ఓ  అమ్మాయి కష్టపడి ఓ పిల్లి పిల్లను కాపాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

 

ఇవి కూడా చదవండి


ఒక అమ్మాయి కాలువలో చిక్కుకున్న పిల్లిని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు దానిని బయకు తీసింది. ఆ పిల్లిని బయటకు తీసేందుకు ఆమె నేలపై పడుకొని రోడ్డు కింద ఉన్న డ్రైనేజీలో చేయిపెట్టి ఆ పిల్లిని కాపాడింది. పిల్లిపై మానవత్వం చూపించి దాని ప్రాణాలు రక్షించిన ఆమెపై చుట్టున్న జనాలు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటడగా, నెటిజన్లు సైతం ఆమెను అభినందిస్తున్నారు. ఆ పిల్లి పిల్ల ఆ అమ్మాయి చేతిలోకి వచ్చిన వెంటనే ఆమె తన ఒడిలోకి తీసుకొని ఆనందంతో ఉప్పొంగిపోయింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి