ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గంటలు గంటలు ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగితేలుతున్నారు చాలా మంది. యూట్యూబ్ ఛానల్స్, రీల్స్ అంటూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ గురించిన పూర్తి వివరాలను నెట్టింట్లో తెలియజేస్తున్నారు. అలాగే.. ఇటీవల సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి సంఖ్య మరింత పెరిగిపోయింది. ఇంట్లోనే కాకుండా.. రోడ్డుపై.. ప్రయాణాల్లో.. బస్సులలో.. రైళ్లలో.. కాలేజీలలో ఇలా ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు రీల్స్ చేస్తూ ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగోట్టుకున్నవారు చాలా మందే ఉన్నారు. సముద్ర తీరనా.. నది ఒడ్డున.. రైల్వే ట్రాక్ పక్కన.. రోడ్డు మీద .. ఇలా కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాలలో రీల్స్ చేస్తూ ఊహించని ప్రమాదానికి గురవుతారు.. మరికొన్నిసార్లు.. విలువైన వస్తువులను పొగోట్టుకుంటారు. తాజాగా ఓ యువతి కూడా రీల్స్ మైకంలో పడి ఖరీదైన ఫోన్‌ను నీళ్లలో పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో ఓ యువతి సరస్సు దగ్గర రీల్ చేసేందుకు ప్రయత్నించింది. ముందుగా సరస్సు ఒడ్డున ఓ ట్రిపుల్ స్టాండ్‌కు ఫోన్ పెట్టి సెట్ చేసింది. ఆ తర్వాత తాను కాస్త ముందుకు వెళ్లి మరో బండపై నిల్చుని వెనక్కు తిరిగి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అయితే అప్పటికే ఆ స్టాండ్ తో సహా ఫోన్ కూడా సరస్సులో పడిపోతుంది. ఈ విషయం తెలియని ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తూనే ఉంది.. రీల్ చేసిన తర్వాత ఫోన్ వైపు చూడగ్గానే.. అది నీళ్లలో ఉండడం చూసి.. వెంటనే వెళ్లి చట్టుకున్న ఫోన్ తీసేసుకుంది. అయితే అమ్మాయి రీల్ చేయడం అక్కడే ఉన్న మరోకరు వీడియో తీశారు. దీంతో నీళ్లలో కావాలనే ఫోన్ పడేశారా ? కేవలం రీల్ కోసమే ఇలా ఫోన్ పడిపోయేలా చేసారని చూడగానే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఆ అమ్మాయి ఉద్దేశపూర్వకంగానే చేసిందని.. రీల్స్ కోసం ఫోన్ పడేసిందని.. తెలివితక్కువ మనుషులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..
Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట