AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.. ఈ ఒక్కసారికి క్షమించు బేబీ.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: సాధారణంగా ఏదైనా చిన్న తప్పు చేస్తే స్వారీ చెబుతారు. ఎందుకంటే అంతటితో ఆ సమస్య సమసిపోతుంది. కాదని పట్టుబడితే..

Viral Video: ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.. ఈ ఒక్కసారికి క్షమించు బేబీ.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!
Lover Begging
Shiva Prajapati
|

Updated on: Aug 26, 2022 | 4:23 PM

Share

Viral Video: సాధారణంగా ఏదైనా చిన్న తప్పు చేస్తే స్వారీ చెబుతారు. ఎందుకంటే అంతటితో ఆ సమస్య సమసిపోతుంది. కాదని పట్టుబడితే.. అదికాస్తా ముదిరి.. పెద్ద పెద్ద వివాదాలకు దారి తీస్తుంది. చాలా మంది పెద్దలు ఎప్పుడూ ఒకటి చెబుతుంటారు.. క్షమాగుణం అన్నింటికంటే ఉత్తమమైందని అన్నారు. అయితే, అన్నిసార్లూ క్షమాపణలను యాక్సెప్ట్ చేయడం కూడా వీలుపడదు. ఎందుకంటే.. తప్పులు మీద తప్పులు చేస్తూ దొరికిపోయిన ప్రతిసారీ క్షమించమంటే.. క్షమించలేరు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రేమికుల విషయానికి వస్తే ఇది కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే.. పొద్దున లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు సారీలతోనే గడిచిపోతుంది. అలకలు, బుజ్జగింపులు, సారీలు ప్రేమలో కామన్. అయితే, కొన్నికొన్నిసార్లు అది సీరియస్‌కు దారితీస్తుంది. ఎంత బ్రతిమిలాడి సారీ చెప్పినా ఫలితం ఉండదు. తాజాగా లవర్స్‌కి సంబంధించి ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు తమ అనుభవాలను షేర్ చేసుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ యువకుడు ఓ అమ్మాయిని క్షమించండిన బ్రతిమాలుతుండి. ఆ అమ్మాయి ఎంతకూ వినకపోవడంతో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అని వేడుకుంటున్నారు. అయినా వినకపోవడంతో కాళ్లు పట్టుకుని మరీ సారీ చెప్పాడు. పక్కనే అతని ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అతను అక్కడ నిల్చుని, పాపం ఈ ఒక్కసారికి క్షమించేయొచ్చుగా అని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి కనిరించలేదు. దాంతో అతను కాళ్లపై పడి బ్రతిమాలడం మొదలు పెట్టాడు. కాళ్లను బిగ్గర పట్టుకుని వేడుకున్నాడు. ఆ అమ్మాయి వదలరా బాబూ అంటూ ఇబ్బంది పడుతూ.. అతన్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తోంది. అబ్బాయి రిక్వెస్ట్‌కు ఓ వైపు నవ్వుకుంటూనే.. మరోవైపు మొండికేస్తోంది. అయితే, ఈ ఫన్నీ వీడియోను ఫన్ టాప్ అనే ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్