Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కార్లను మింగిన భూమి.. పార్కింగ్ స్థలంలో ఉంచిన కార్లు.. సొరంగంలోకి.. షాకింగ్ వీడియో..

Jerusalem hospital: రహదారిపై వాహనాలన్నీ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసుపత్రి దగ్గర నిలిపి ఉంచిన మూడు కార్లు అకస్మాత్తుగా భూమిలోకి దూసుకెళ్లాయి.

Viral Video: కార్లను మింగిన భూమి.. పార్కింగ్ స్థలంలో ఉంచిన కార్లు.. సొరంగంలోకి.. షాకింగ్ వీడియో..
Giant Sinkhole Swallows Three Cars
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 09, 2021 | 2:21 PM

Jerusalem hospital: రహదారిపై వాహనాలన్నీ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసుపత్రి దగ్గర నిలిపి ఉంచిన మూడు కార్లు అకస్మాత్తుగా భూమిలోకి దూసుకెళ్లాయి. సొరంగం ఒక్కసారిగా ఈ కార్లను కబళించింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలెం జాతీయ రహదారికి సమీపంలోని పార్కింగ్ స్ధలంలో జరిగిన ఈ సంఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. షారే జెడెక్ మెడికల్ సెంటర్ పార్కింగ్ స్థలంలో సోమవారం భూమి హఠాత్తుగా కుంగిపోయి.. అక్కడ ఉంచిన మూడు కార్లు గుంతలో పడిపోయాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. వెంటనే రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు.

అయితే.. ఈ ప్రాంతంలో ఒక సొరంగం నిర్మాణంలో ఉందని అధికారులు తెలిపారు. ఇది ఆసుపత్రి పార్కింగ్ స్థలం కింద వెళుతోందని.. ఈ క్రమంలో సొరంగం పాక్షికంగా కూలిపోయిందని వెల్లడించారు. దీంతో సొరంగం పైన ఉన్న కార్లు ఒక్కసారిగా భూమిలోకి పడిపోయాయని వెల్లడించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా భయపడిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి..

వీడియో..

Also read:

యాంటీ బాడీల వృద్ధికి మాస్ వ్యాక్సినేషన్ పరిష్కారం…..లక్నో మెడికల్ యూనివర్సిటీ రీసెర్చర్ల అధ్యయనంలో వెల్లడి

Mehul Choksi: మెహుల్‌ చోక్సీకి నో బెయిల్‌.. విచారణను వాయిదా వేసిన డొమినికా కోర్టు..

ఈ స్టాక్‌లను కొంటే లాభాల పంటే..ఏడాదిలో 30 శాతం వరకూ రాబడి
ఈ స్టాక్‌లను కొంటే లాభాల పంటే..ఏడాదిలో 30 శాతం వరకూ రాబడి
చీపురుని పొరపాటున కూడా ఈ రోజుల్లో కొనొద్దు.. ఎందుకో తెలుసా..
చీపురుని పొరపాటున కూడా ఈ రోజుల్లో కొనొద్దు.. ఎందుకో తెలుసా..
కొండెక్కిన కొబ్బరి బోండా...ధర తెలిస్తే షాక్ అవుతారు?
కొండెక్కిన కొబ్బరి బోండా...ధర తెలిస్తే షాక్ అవుతారు?
ముఖ్యమంత్రి మనవడితో నిశ్చితార్థం.. ఇప్పుడు మరో వ్యక్తితో..
ముఖ్యమంత్రి మనవడితో నిశ్చితార్థం.. ఇప్పుడు మరో వ్యక్తితో..
అంతులేని విషాదం.. 5ఏళ్లుగా కోమా లోనే యువకుడు..మెరుగైన వైద్యం కోసం
అంతులేని విషాదం.. 5ఏళ్లుగా కోమా లోనే యువకుడు..మెరుగైన వైద్యం కోసం
మధుహేహం ఉన్న వారికి ఈ పువ్వు సంజీవని లాంటిది.. ఒక్కటి తింటే షుగర్
మధుహేహం ఉన్న వారికి ఈ పువ్వు సంజీవని లాంటిది.. ఒక్కటి తింటే షుగర్
యువతకు ష్యూరిటీ లేకుండా లోన్లు.. స్వయం ఉపాధే లక్ష్యం
యువతకు ష్యూరిటీ లేకుండా లోన్లు.. స్వయం ఉపాధే లక్ష్యం
మూఢ నమ్మకాలతో కూతుర్ని బలిచ్చిన తల్లి.. కోర్టు సంచలన తీర్పు
మూఢ నమ్మకాలతో కూతుర్ని బలిచ్చిన తల్లి.. కోర్టు సంచలన తీర్పు
భీకర ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ దూరం!
భీకర ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ దూరం!
వేసవిసెలవుల్లో నార్త్ ఇండియా చుట్టేయండి తక్కువ ధరకే సూపర్ ప్యాకేజ
వేసవిసెలవుల్లో నార్త్ ఇండియా చుట్టేయండి తక్కువ ధరకే సూపర్ ప్యాకేజ