Ganesh Chaturthi 2025: రాహు, కేతు దోషాల నుంచి బయటపడాలంటే.. వినాయక చవితి రోజు ఈ మంత్రాలు జపించండి..!

2025 ఆగస్టు 27న వచ్చే వినాయక చవితి ప్రత్యేక జ్యోతిష్య ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున గణేశుడిని పూజించడం ద్వారా రాహు-కేతు దోషాల ప్రభావం తగ్గుతుంది. మంత్రాలు, వాస్తు చిట్కాలు, పూజా విధానాల ద్వారా జీవితంలో శాంతి, స్పష్టత, సంపద పొందవచ్చు. వినాయకుడు విఘ్నహర్తగా మన కర్మ బంధాలను తొలగిస్తాడు.

Ganesh Chaturthi 2025: రాహు, కేతు దోషాల నుంచి బయటపడాలంటే.. వినాయక చవితి రోజు ఈ మంత్రాలు జపించండి..!
Lord Ganesha Puja

Updated on: Aug 26, 2025 | 2:42 PM

2025 ఆగస్టు 27న బుధవారం వచ్చే వినాయక చవితి చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున పూజలు చేస్తే.. రాహు, కేతువుల వల్ల కలిగే సమస్యలైన గందరగోళం, ఆటంకాలు, ఆలస్యాల నుండి బయటపడవచ్చు. వినాయకుడు విఘ్నహర్త (అడ్డంకులను తొలగించేవాడు) కాబట్టి ఈ రోజు ఆయనను పూజిస్తే మన జీవితంలో శాంతి, స్పష్టత, పురోగతి వస్తాయి.

రాహు-కేతు, కర్మ సంబంధం

  • రాహు-కేతువులు నిజమైన గ్రహాలు కావు.. ఇవి ఛాయా గ్రహాలు.
  • రాహువు.. మన కోరికలు, ఆశలు, భౌతిక సుఖాలను సూచిస్తాడు.
  • కేతువు.. అన్నిటి పట్ల వైరాగ్యం, ఆధ్యాత్మికత, కష్టాల ద్వారా వచ్చే పాఠాలను సూచిస్తాడు.

జాతకంలో ఈ గ్రహాలు సరిగ్గా లేకపోతే గందరగోళం, ఆర్థిక సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు, సంబంధాలు చెడిపోవడం, తెలియని భయాలు కలుగుతాయి. వినాయక చవితి రోజున వినాయకుడిని పూజిస్తే ఈ చెడు ప్రభావాలు తగ్గుతాయి. ముఖ్యంగా రాహు-కేతువుల దశ నడుస్తున్న వారికి ఈ రోజు చాలా మంచిది.

రాహు-కేతు దోషాలకు వినాయకుడు ఎందుకు పరిష్కారం..?

  • వేద జ్యోతిష్యం ప్రకారం.. ఏ పూజ చేసినా మొదట వినాయకుడిని పూజించడం తప్పనిసరి.
  • ఆయన తెలివి, వివేకాన్ని ఇస్తాడు.
  • రాహువు కలిగించే మోసాలు, భ్రమలను తొలగిస్తాడు.
  • కేతువు కలిగించే ఒంటరితనం, ఆధ్యాత్మిక గందరగోళాన్ని తగ్గిస్తాడు.
  • వినాయకుడి అనుగ్రహం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

2025 వినాయక చవితి జ్యోతిష్య ప్రాముఖ్యత

శని, బుధుడు, గురుడు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఈ రోజు చేసే పూజలు, మంత్ర జపాలు మంచి ఫలితాలను ఇస్తాయి. రాహు-కేతువుల ప్రభావం వల్ల జీవితంలో ఏ రంగాలలో మార్పు అవసరమో ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఈ రోజు దోష నివారణ పూజలు చేయడానికి చాలా అనుకూలమైనది.

రాహు-కేతు దోషాలకు ఆధ్యాత్మిక పరిహారాలు

పూజ

ఉదయం ఇల్లు శుభ్రం చేసి ఈశాన్య దిశలో (మూలలో) మట్టి వినాయక విగ్రహాన్ని పెట్టండి. విగ్రహం తూర్పు వైపు చూస్తున్నట్టు ఉండాలి. నెయ్యి దీపం వెలిగించండి.

మంత్రాలు

  • రాహు దోషానికి.. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
  • కేతు దోషానికి.. ఓం విఘ్న నాశనాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
  • ఈ మంత్రాలను పది రోజుల పాటు ఉదయం, సాయంత్రం జపించండి.

ప్రసాదం.. మోదకాలు, లడ్డూలు సమర్పించి వాటిని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంచండి.

వాస్తు చిట్కాలు (ఇంటికి, ఆఫీసుకి)

  • ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచి, మామిడి ఆకుల తోరణం కట్టండి.
  • మీ ఆఫీసు టేబుల్‌పై చిన్న వినాయక విగ్రహం లేదా ఫోటో ఉంచండి.
  • రాహువు ప్రభావం తగ్గడానికి స్ఫటికం (crystal), కేతువు ప్రభావం తగ్గడానికి సిట్రిన్ లేదా టైగర్ ఐ రత్నాలను ఉపయోగించండి.
  • ఈశాన్య దిశలో శ్రీయంత్రంను వినాయక మంత్రాలు చదువుతూ పెట్టండి.

రాశి ప్రకారం సూచనలు

  • మేషం, తుల.. వీరు ఎక్కువగా పూజలు, ధ్యానం చేయడం మంచిది.
  • వృషభం, వృశ్చికం.. వీరికి సంబంధాలు, ఆర్థిక రంగంలో ఇబ్బందులు రావచ్చు. వినాయకుడిని పూజిస్తే లాభం ఉంటుంది.
  • మిథునం, ధనుస్సు.. వీరు ధ్యానం చేయడం వల్ల నిర్ణయాలలో స్పష్టత వస్తుంది.
  • మకరం, కర్కాటకం.. వీరి వృత్తి, కుటుంబ జీవితంలో మంచి మార్పులు వస్తాయి.
  • సింహం, కుంభం.. వీరి మానసిక ప్రశాంతత, భావోద్వేగ స్థిరత్వం పెరుగుతాయి.
  • మీనం, కన్య.. వీరు నిరంతరం భక్తి, మంత్ర జపం చేయడం వల్ల జీవితంలో సమతుల్యత వస్తుంది.

ఈ సంవత్సరం రాహు-కేతువుల వల్ల కలిగే కష్టాలను శిక్షలుగా కాకుండా.. మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి వచ్చిన అవకాశాలుగా చూడండి. వినాయకుడు కేవలం సమస్యలను తొలగించడమే కాదు.. వాటిని అధిగమించే శక్తిని కూడా ఇస్తాడు. ఈ వినాయక చవితికి ఈ చిట్కాలను పాటించి.. జీవితంలో శాంతి, సంపదను ఆహ్వానించండి.