Viral Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. ఏమిరా బాలరాజూ ఎంతపని అయిపాయే.. పొట్ట చెక్కలయ్యే వీడియో..!
Viral Video: జీవితంలో ఎప్పుడూ షార్ట్‌కట్‌లు తీసుకోకూడదని అంటారు. ఎందుకంటే.. అత్యాశకు పోతే అనుకోని అవాంతరాలు ఎదురవుతాయని పెద్దలు చెబుతుంటారు.
Viral Video: జీవితంలో ఎప్పుడూ షార్ట్‌కట్‌లు తీసుకోకూడదని అంటారు. ఎందుకంటే.. అత్యాశకు పోతే అనుకోని అవాంతరాలు ఎదురవుతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే, ఎవరెన్ని చెప్పినా కొందరు అస్సలు పట్టించుకోరు. మంచి మాటలు చెవికెక్కించుకోరు. స్వీయ అనుభవంలో బోల్తా పడితే కానీ వారికి తత్వం బోధపడదు. తాజాగా ఈ సూక్తికి నిదర్శనమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షార్ట్ కట్ కోసం ట్రై చేస్తే.. ఫసక్ అయ్యింది. ఈ వీడియో చూస్తే.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వు రావడం ఖాయం. ఎందుకు సామీ ఇన్ని కష్టాలు.. దర్జాగా మంచి దారిలో వెళ్తే సరిపోదా అని సలహాలు కూడా ఇవ్వాలనిపిస్తుంటుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వీడియోలో ఓ చిన్నపాటి కాలువ ఉంది. అందులో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే, కాలువకు అవతలి వైపు కారు, ఇవతలి వైపున కొందరు యువకులు ఉన్నారు. కారును చేరుకోవాలంటే కాలువ దాటాల్సి ఉంటుంది. మరి కాలువ దాటడం అంత ఈజీ ఏమీ కాదు. కూత వేటు దూరంలో కాలుపై బ్రిడ్జి మాదిరిగా దారి కూడా ఉంది. కానీ, వారు అంత దూరం వెళ్లడానికి ఇష్టపడలేదు. షార్ట్ కట్‌లో కాలువను దాటాలని నిర్ణయించుకున్నారు. కారుకు ఇవతలి వైపున కాలువ గట్టున ఓ చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మను పట్టుకుని కాలువను దాటాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముందు.. ఓ యువకుడు పొలోమని ముందుకొచ్చాడు. వీరుడిలా చెట్టు కొమ్మను పట్టుకుని కాలువను దాటే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ యువకుడు చివరి వరకు బాగానే వెళ్లాడు. కాలువ గట్టును చేశాడు. చెట్టు కొమ్మ సాయంతో కాలువను విజయవంతంగా దాటాడు. కానీ అప్పుడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. కాలువ గట్టున కాలు పెట్టడంతో అది కాస్తా పట్టుతప్పింది. ఇంకేముంది.. కాలువలో బొక్కబోర్లా పడిపోయాడు. మొత్తం నీటిలో తడిసిపోయాడు. పక్కనే ఉన్న యువకులు ఈ సీన్ చూసి గొల్లున నవ్వుకున్నారు. అయితే, ఈ సీన్ అంతటినీ వీడియో చిత్రీకరించిన యువకులు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఇదెక్కడ స్టంట్ రా మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.27 లక్షల మంది నెటిజన్లు వీక్షించగా.. వేలాది లైక్స్ వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు తమదైన స్టైల్‌లో సెటైర్లు, ఫన్నీ కామెంట్స్ వదులుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
View this post on Instagram
Also read:
Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..
Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి