Viral Video: పండు మిర్చి కొరికిన తర్వాత ఈ తాబేలు రియాక్షన్ చూశారా..?
ప్రస్తుతం సోషల్ మీడియాలోని విపరీతమైన కాంపిటీషన్‌లో.. యూనిక్ కంటెంట్నే అందించేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. ఇక కొందరు వినూత్నమైన ఆలోచనలతో... కంటెంట్‌ను అందరికీ వినోదంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతగాడు కూడా అలాంటి అన్వేషణలో ఒక విభిన్నమైన, సరదా వీడియోని పోస్ట్ చేశాడు.

ప్రజంట్ సోషల్ మీడియాలో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. యూనిక్ కంటెంట్‌నే జనం ఆదరిస్తున్నారు. దీంతో భిన్నమైన కంటెంట్ అందించేందుకు కొందరు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అలా ఇతగాడు ఊహించిన వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు. మాములుగా మనం మిరపకాయ పొరపాటున తింటే మంట నషాలానికి అంటుతుంది. అదే తాబేలుకు మిర్చి తినిపిస్తే అది ఎలా స్పందిస్తుంది అనేది అతడి ఆలోచన. థాట్ వచ్చిందే తడవు యాక్షన్‌లోకి దిగిపోయాడు. తాబేలుకు ఎర్రటి పండు మిర్చి తినిపించాడు. దాన్ని కొరికి కొద్దిగా నమలగానే.. దానికి మంట.. నడినెత్తికి ఎక్కి వెంటనే ఊసేసింది. ఆ కొరికిన ముక్కను పక్కక తోస్తూ వెనక్కి జరిగింది. ఆపై మళ్లీ తినిపించబోగా అక్కడి నుంచి వెనక్కి పరుగులు తీసింది. మాములుగా తాబేలు అంటేనే నిదానానికి పర్యాయపదం అని చెబుతారు. అలాంటిది ఆ మిర్చి నుంచి తప్పించుకోడానికి ఆ తాబేలు ఎంత హడావిడిగా పక్కకు వెళ్లిందో వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
వీడియో దిగువన చూడండి…
View this post on Instagram
