పేలిపోయిన ఏసీ.. ముగ్గురు మృతి
హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. ఓ బిల్డింగ్ మొదటి ఫ్లోర్‌లో ఏసీ కంప్రెసర్ పేలడంతో ఆ దట్టమైన పొగకు ఊపిరాడక ఫస్ట్ ఫ్లోర్‌లో నిద్రిస్తున్న ముగ్గురు చనిపోయారు. వారి కుమారుడు మాత్రం కిటికీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ హృదయ విదారక ఘటన స్థానికుల్లో విషాదం నింపింది.
ఫరీదాబాద్‌లోని ఓ నాలుగంతస్తుల భవనంలో రెండో అంతస్తులో సచిన్ కపూర్ తన కుటుంబంతో నివసిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న ఏసీ కంప్రెసర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ సమయంలో మొదటి అంతస్తు ఖాళీగా ఉంది. ఈ పేలుడు కారణంగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు భవనమంతా వ్యాపించాయి. రెండో అంతస్తులో నిద్రిస్తున్న సచిన్ కపూర్, ఆయన భార్య రింకు కపూర్, వారి కుమార్తె సుజన్ కపూర్.. ఆ పొగను పీల్చడంతో ఊపిరాడక మరణించారు. వారితో పాటే వారి పెంపుడు కుక్క కూడా ప్రాణాలు విడిచింది. మరో గదిలో నిద్రిస్తున్న వారి కుమారుడు ప్రమాదాన్ని పసిగట్టి, ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీలోంచి కిందికి దూకేశాడు. ఈ క్రమంలో అతనికి తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పెద్ద శబ్దం విని తామంతా ఉలిక్కిపడి లేచామనీ వెంటనే భవనంలోని ఇతరులను కాపాడటానికి ప్రయత్నించామని.. మయాంక్ అనే పొరుగింటి వ్యక్తి తెలిపారు. కపూర్ కుటుంబం మూడో అంతస్తును తమ ఆఫీసుగా వినియోగిస్తుండగా, నాలుగో అంతస్తులో ఏడుగురు సభ్యులున్న మరో కుటుంబం నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Apple Event: యాపిల్ కావాలా నాయనా
భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
ఎయిర్‌పోర్ట్ అధికారుల చేతివాటం బ్యాటరీలు, నూనె దొంగిలించి..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

