సాధారణంగా పామును దూరం నుంచి చూస్తే చాలు.. ఠక్కున వెనక్కి చూడకుండా పరుగులు పెడతాం. మరి అలాంటిది కుప్పలు తెప్పలుగా పాములన్నీ ఒకే దగ్గర చూసినట్లయితే.. ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. ఇక్కడ కూడా అదే సీన్.. వీడియో చూస్తే మీరు వణికిపోవడం ఖాయం.
సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. అలాంటి కోవకు చెందినదే ఈ వీడియో. ఇందులో మీరు ఓ సరస్సులో కుప్పలు తెప్పలుగా ఉన్న పాములను చూడవచ్చు. అక్కడ నీటిలోనే కాదు.. ఒడ్డున కూడా పాములు సేద తీరుతున్నాయి. అడుగేస్తే చాలు.. సరాసరి కాటికి వెళ్ళినట్లే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ధైర్యముంటేనే వీడియో చూడాలంటూ’ రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మరి మీరూ ఓ లుక్కేయండి.