Petrol Tank: రోడ్డుపై పేలిన ఆయిల్‌ ట్యాంకర్‌.. 25 మందికిపైగా మృతి

|

Sep 15, 2024 | 4:17 PM

హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధన ట్యాంకర్‌ పేలి 25 మందికిపైగా మృతి చెందారు. 50మందికి పైగా గాయపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌ టైరు పంక్చర్ అవ్వడంతో ఆయిల్‌ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. అదే సమయంలో పేలుడు జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

Petrol Tank: రోడ్డుపై పేలిన ఆయిల్‌ ట్యాంకర్‌.. 25 మందికిపైగా మృతి
Fuel Tanker Explosion
Follow us on

హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధన ట్యాంకర్‌ పేలి 25 మందికిపైగా మృతి చెందారు. 50మందికి పైగా గాయపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌ టైరు పంక్చర్ అవ్వడంతో ఆయిల్‌ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. అదే సమయంలో పేలుడు జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్‌లో తరలించారు. ప్రమాద స్థలాన్ని ప్రధాని గ్యారీ కొనల్‌ పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

రోడ్డుపై వెళుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌ టైరు తొలుత పంక్చర్‌ అయింది. దీంతో ఆయిల్‌ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో పేలుడు జరిగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్‌లో తరలించారు.ప్రమాద స్థలాన్ని ప్రధాని గ్యారీ కొనల్ పరిశీలించారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదానికి కారణం ట్యాంకర్‌ అదుపు తప్పి పల్టీలు కొట్టడం అని స్థానికులు వివరించారు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘ఇది చాలా భయంకర ప్రమాదంగా పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. హైతీలో కొన్ని ప్రాంతాలు మిలిటెంట్‌ గ్యాంగుల ఆధీనంలో ఉండటంతో అత్యవసర వస్తువుల రవాణాకు రోడ్డు మార్గం కంటే నౌకలను ఎక్కువగా వాడుతుండడం గమనార్హం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..