దాదాపు మన అందరికీ వీధి బండ్ల మీద విక్రయించే పండ్లు, కూరగాయలు కొనడం అలవాటు. మార్కెట్‌లో ఎటు చూసిన ఇలా తోపుడు బండ్లమీద కూరగాయలు, పండ్లు అమ్ముతున్న వారే దర్శమిస్తారు. కానీ వారంతా పరిశుభ్రత నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నారా.? లేదా అంటే మాత్రం ఆ దేవుడికే తెలియాలి..ఎందుకంటే.. మనం ఎవరం అది చూడటం లేదు. కొన్ని రోజుల క్రితం ఒక జ్యూస్ సెంటర్ జ్యూస్‌లో ఒక వ్యక్తి మూత్రం కలిపి వినియోగదారులకు అందిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా అలాంటి ఘటనే మరొకటి మహారాష్ట్రలోని ముంబైకి కూతవేటు దూరంలో ఉన్న డోంబివిలీలో వెలుగులోకి వచ్చింది. ఇలాంటి అసహ్యకరమైన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
డోంబివిలీలోని నీలేజ్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిల్జే గ్రామంలో ఒక పండ్ల వ్యాపారి పండ్లను అమ్ముతున్న విధంగా జుగుప్సకరంగా ఉంది. డోంబివిలీలోని నీల్జే ప్రాంతంలో ఒక పండ్ల వ్యాపారి పనిచేస్తున్న చోటే ప్లాస్టిక్ బాటిల్‌లో మూత్ర విసర్జన చేస్తూ వినియోగదారులకు పండ్లను విక్రయించడం కనిపించింది. అతడు చేసిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను అమ్ముతూ అతడు చేసిన ఈ కిరాతక చర్య వెలుగులోకి రావడంతో ప్రజల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. వైరల్ వీడియోను విచారించిన మాన్‌పాడ పోలీసులు పండ్ల విక్రేతను అదుపులోకి తీసుకున్నారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
ये क्या हरकत है भाई!#Maharashtra : डोंबिवली निलजे इलाके में फल विक्रेता की शर्मनाक हरकत, पेशाब करने के बाद उसी ठेले में थैली रख फिर बेचने लगा फल#Dombivli pic.twitter.com/aFB2Eqt0B3
— NDTV India (@ndtvindia) September 22, 2024
20 ఏళ్ల ఈ యువకుడి పేరు అలీఖాన్‌గా గుర్తించారు పోలీసులు. అతడిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్‌గా మారడంతో డోంబివిలీలో ఆగ్రహం వాతావరణం నెలకొంది. నెటిజన్లు సైతం యువకుడి తీరుపై మండిపడుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..