Funny Ludo game: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక చాలా రకాల అన్‌లైన్ గేమ్స్ వచ్చాయి. అలాంటి గేమ్స్‌లో లూడో కూడా ఒకటి. నిజానికి ఈ లూడో అనేది ఇంటర్నెట్‌కి కొత్తదే అయినా మనకు కొత్త కాదు. ఎన్నో ఏళ్ల నాటి నుంచే మన గ్రామాలలో ఆష్టాచమ్మా పేరుతో ఇలాంటి ఆటను ఆడుతుండేవారు. అయితే ఈ ఆట ఆడటానికి చింతపిక్కలు, గవ్వలు, పాచికలు లేదా డైస్ అయితే తప్పనిసరిగా ఉండాలి. వాటిని వేసినప్పుడు కనిపించన సంఖ్యను బట్టి కదా పావులను కదుపుతారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొందరు స్నేహితులు పైన చెప్పుకున్నవేమి లేకుండానే ఎంతో చురుగ్గా లూడో బోర్డ్‌పై ఆట ఆడేస్తున్నారు. ఇక వారు ఆడుతున్న ఆటతీరుపై నెటిజన్లు తెగ నవ్వేసుకుంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో నలుగురు స్నేహితులు లూడో బోర్డ్‌కి నాలుగు వైపులా కూర్చుని ఉన్నారు. అక్కడే మరో వ్యక్తి తలపై పాత్రను బోర్లించుకున్న ఆటకు వ్యతిరేక దిశలో కూర్చున్నాడు. ఆట ఆడడానికి డైస్ లేకపోవడంతో వారంతా ఎవరి గరిటెను వారు పట్టుకుని కూర్చున్నారు. ఆటలో గరిటె ఎందుకని ఆశ్చర్యపోకండి.. అక్కడే ఉంది ట్విస్ట్. ఆట ఆడుతున్నప్పుడు ఎవరి టర్న్ వస్తే వారు తమ స్నేహితుని తలపై ఉన్న పాత్రపై గరిటెతో కొడతారు. అందుకు పాత్రను బోర్లించుకుని కూర్చున్న వ్యక్తి 1 నుంచి 6 వరకు ఏదో ఓ నంబర్‌ని వేళ్లతో చూపిస్తాడు. దాన్ని బట్టి ఆట ఆడే వ్యక్తి తన పావులను కదుపుతారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు తమ స్నేహితుని తలపై పాత్రను కొట్టి ఆటను కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పిచ్చపిచ్చగా నవ్వేసుకుంటున్నారు. ఇది ఎవరికీ రాని వినూత్నమైన ఐడియా అని.. వీళ్లంతా నిజమైన లూడో ప్రోప్లేయర్లు అని రాసుకొస్తున్నారు. ఇంకా వీళ్ల క్రియేటివిటీ లెవెల్స్‌కి 100 కి వంద మార్కులు వేస్తామని, తలపై పాత్రతో ఉన్న వ్యక్తి మరుసటి రోజు తలనొప్పి, చెవిపోటు రావడం ఖాయమంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే 4 రోజుల క్రితం నెట్టింట షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 7 లక్షల లైకులు, ఒక కోటీ 23 లక్షలకు పైగా వీక్షణలు లభించాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం