Viral Video : పడి లేచిన కెరటం..! కిందపడ్డా గెలిచి నిలిచిన 4 ఏళ్ల చిన్నారి.. వీడియో అదుర్స్

|

Aug 02, 2021 | 5:31 PM

Viral Video : చిన్నారుల రోలర్ స్కేటింగ్ పోటీలకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో 2020

Viral Video : పడి లేచిన కెరటం..! కిందపడ్డా గెలిచి నిలిచిన 4 ఏళ్ల చిన్నారి.. వీడియో అదుర్స్
Viral Video
Follow us on

Viral Video : చిన్నారుల రోలర్ స్కేటింగ్ పోటీలకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో 2020 నాటిది అయినప్పటికీ ఒలంపిక్స్ సందర్భంగా మారోసారి తెగ వైరల్ గా మారుతోంది. మసాచు సెట్స్‌లోని హడ్సన్ లో 8 ఏళ్లలోపు చిన్నారులకు రోలర్ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న నాలుగేళ్ల చిన్నారి మియాస్ పోటీ ప్రారంభమైన వెంటనే కొద్ది దూరం ముందుకెళ్లి కిందపడిపోతుంది. అయితే కింద పడ్డాకూడా ఏ మాత్రం వెనకడుగు వేయని మియాస్ వెంటనే తేరుకొని తిరిగి స్కేటింగ్ ప్రారంభిస్తుంది. అయితే.. కిందపడ్డ మియాస్ పోటీలో ముందున్న చిన్నారులను వెనక్కినెట్టి విజేతగా నిలుస్తుంది. ఈ పోటీలకు సంబంధించిన వీడయోను మియాస్ తండ్రి ఆంటోని రికార్డు చేసి నెట్టింట్లో పంచుకున్నారు.

500 మిలియన్ల వ్యూస్ ఆ వీడియో సొంతం
మియాస్ తండ్రి ఆంటోని పంచుకున్న ఈ వీడియో 500 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుందంటే ఏ స్థాయిలో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుందో ఊహించుకోవచ్చు. ఒలంపిక్స్ జరుగుతున్న వేళ ఈ వీడియో మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

గమ్యం చేరాలన్న పట్టుదల ఉంటే విజయం మనవెంటే
పోటీలు జరుగుతుండగా అనుకోని అవాంతరాలు ఎదురైనా గమ్యం చేరాలన్న పట్టుదల ఉంటే విజయం మన వెంటే అనేందుకు ఈ చిన్నారి ప్రయత్నమే అందుకు నిదర్శనం. ఒలింపిక్స్ బాడ్మింటన్ మహిళా సింగిల్స్ సెమిస్ లో ఓడినా కూడా కుంగిపోకుండా బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన పోటీల్లో సత్తాచాటింది కాబట్టే మరో ఒలింపిక్స్ పతాకాన్ని పీవీ సింధూ తన ఖాతాలో వేసుకుంది. దేశం, తెలుగు జాతి గర్వించేలా చేసింది.

Political Row: వీధిపోరాటాలకు కారణమవుతున్న డైలాగ్‌వార్‌.. తన్నుకున్న రెండు పార్టీల కార్యకర్తలు..

Crime News : ఆ నిండు ‘వెన్నెల’ అస్తమించింది.. కులం రక్కసికి బలైపోయింది.. కంటతడి పెట్టిస్తున్న మరణ లేఖ..

Tokyo Olympics 2020 Live: మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్స్‌కు వర్షం అడ్డంకి.. ఫలితం తేలకుండానే ఆగిపోయిన మ్యాచ్‌..