Metro Viral Video : ఇలా తయారయ్యారేంట్రా సామీ.. మెట్రోలో అమ్మాయిల పైత్యం.. !

మెట్రోలో ఉన్న చాలా మంది వారి వింత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది వారిని వీడియోలు, ఫోటోలు తీయడం ప్రారంభించారు. ఆ నలుగురు అమ్మాయిలు కూడా మెట్రోలోని ప్రయాణికులతో కలిసి సెల్ఫీలకు హ్యాపీగా పోజులిస్తున్నారు.

Metro Viral Video : ఇలా తయారయ్యారేంట్రా సామీ.. మెట్రోలో అమ్మాయిల పైత్యం.. !
Four Girls

Updated on: Dec 01, 2024 | 5:59 PM

మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. ఇక ఢిల్లీ మెట్రోకు సంబంధించి అనేక వీడియోలు తరచూ చర్చలోకి వస్తుంటాయి. ఇటీవల, ఒక వీడియోలో ఒక అమ్మాయి చిరిగిన దుస్తులతో మెట్రోలోకి ప్రవేశించగా, ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇప్పుడు మెట్రోకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. కానీ ఈసారి అది ఢిల్లీ మెట్రోకు చెందినది కాదు..అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్ అయిన వీడియోలో నలుగురు అమ్మాయిలు మెట్రోలో ప్రయాణించేందుకు వచ్చారు. కానీ, వారు ధరించిన దుస్తులు మాత్రం అందరికీ అభ్యంతరకరంగా మారాయి. మెట్రో స్టేషన్‌లో కనిపించిన నలుగురు అమ్మాయిలు ఒంటికి టవల్స్‌ చుట్టుకుని హై హీల్స్‌ ధరించి స్టేషన్లో ఉన్నారు. మెట్రో రాగానే లోపలికి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. మెట్రోలో ఉన్న చాలా మంది వారి వింత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది వారిని వీడియోలు, ఫోటోలు తీయడం ప్రారంభించారు. ఆ నలుగురు అమ్మాయిలు కూడా మెట్రోలోని ప్రయాణికులతో కలిసి సెల్ఫీలకు హ్యాపీగా పోజులిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వీడియో @mimisskate అనే Insta పేజీలో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 18 లక్షలకు పైగా వీక్షించారు. వేల మంది దీన్ని లైక్ చేసి షేర్ చేశారు. వీడియోపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ ఆడవాళ్ళు బాత్‌రూమ్‌లోంచి నేరుగా మెట్రోకి వచ్చినట్లుంది అని ఒకరు రాయగా, ఇందులో ఎలాంటి తప్పు కనిపించడం లేదని, అందుకే మెట్రో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చారని అంటున్నారు. ఈ మెట్రో ప్రయాణాన్ని ప్రయాణికులు జీవితాంతం గుర్తుంచుకుంటారు అని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..