Telugu News Trending Foreign woman dancing bhangra videos are viral on social media Trending news
Viral Video: ఇండియన్ డ్యాన్స్ పై మనసు పారేసుకున్న విదేశీ మహిళ.. అచ్చం ప్రొఫెషనల్ డ్యాన్సర్ లా స్టెప్పులు వేస్తూ
ఇండియన్స్ (Indians) ఫారన్ లాంగ్వేజెస్ సాంగ్స్, ఇంగ్లీష్ సినిమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. అదేవిధంగా విదేశాల్లో కూడా బాలీవుడ్ పాటలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందుకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో...
ఇండియన్స్ (Indians) ఫారన్ లాంగ్వేజెస్ సాంగ్స్, ఇంగ్లీష్ సినిమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. అదేవిధంగా విదేశాల్లో కూడా బాలీవుడ్ పాటలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇందుకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతుంటాయి. అందులో విదేశీయులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు కూడా ఉంటాయి. ఇండియన్ పాటలకు తనదైన స్టైల్ లో డ్యాన్స్ చేస్తూ కోట్లాది హృదయాలను కొల్లగొట్టే విదేశీయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పంజాబీ పాటలు ఎంత వినసొంపుగా ఉంటాయంటే సంగీత ప్రియులు వాటిని విన్న తర్వాత డ్యాన్స్ చేయకుండా ఆపుకోలేరు. ఈ పంజాబీ పాటల క్రేజ్ అమెరికన్ మహిళ వరకు వెళ్లింది. ఆమె రోజూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భాంగ్రా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఒమలా అనే అమెరికన్ మహిళ ప్రొఫెషనర్ డ్యాన్సర్ లా భాంగ్రా స్టెప్పలు వేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
అమల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రీల్స్‌లో ఆమె అత్యుత్తమ కదలికలను మీరు చూడవచ్చు. ఒమల కేవలం పంజాబీ పాటలకే కాకుండా బాలీవుడ్ పాటలకూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. అంతే కాకుండా ఆమె రీల్స్ చేసే సమయంలో భారతీయ కాస్ట్యూమ్స్ ను మాత్రమే ధరిస్తుంది. ఆమె తన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో Omala olly_.g అనే ఖాతాతో షేర్ చేస్తోంది. ఆమె వీడియోలు చూసిన వారందరూ అసాధారణ ప్రతిభకు ప్రశంసిస్తున్నారు.