AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FLIPKART TV SALE: భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీ సేల్.. ఆఫర్ల వర్షం..

FLIPKART TV SALE LIVE: భారత ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సరికొత్త డిస్కౌంట్ ఆఫర్లతో బిగ్ సేల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సారి స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్లతో అమ్మేందుకు ప్రణాళిక రూపొందించింది.

FLIPKART TV SALE: భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీ సేల్.. ఆఫర్ల వర్షం..
Flipkart
Ayyappa Mamidi
|

Updated on: Feb 06, 2022 | 6:44 PM

Share

FLIPKART TV SALE LIVE: భారత ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సరికొత్త డిస్కౌంట్ ఆఫర్లతో బిగ్ సేల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సారి స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్లతో అమ్మేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా స్మార్ట్, హెచ్ డి, ఎఫ్ హెచ్ డి టీవీలపై 70 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. దీనిని ఫ్లిప్ కార్ట్ టీవీ సేల్ పేరుతో వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ మెగా టీవీ సేల్ ను నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు నిర్వహిస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

ఈ సేల్ లో రెడ్మి, సామ్ సంగ్, వన్ ప్లస్, వియు తో పాటు మరిన్ని దిగ్గజ బ్లాండ్ల టీవీలను భారీ తగ్గింపు ధరలకు అమ్మకానికి అందుబాటులో ఉంచింది. వివిధ రకాల సైజులు, రిజల్యూషన్లు, ఫీచర్లు వినియోగదారులకు ఈ సేల్ లో అందుబాటులో ఉంటాయి. వీటికి అదనంగా క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిక్స్ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు.. ఈ సేల్‌లో అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అంతే కాకుండా, కొనుగోలుదారులు తమ పాత టీవీలను ఎక్స్ఛేంజ్ చేసుకుని వాటికి బదులు… సేల్ లో కొత్త వాటిని కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ ఆఫర్ కేవలం సామ్ సంగ్ స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు మాత్రమే ఉంది. రియల్ మి కూడా ఎక్స్ఛేంజ్ సదుపాయాన్ని అందిస్తోంది.

ఇదీ చదవండి:

PPF vs NPS investment: ఉద్యోగ విరమణ నిధికోసం ఎందులో పెట్టుబడి పెడితే లాభం.. పీపీఎఫ్? ఎన్ పీఎస్?

TV9 Digital TOP 9 NEWS : సరిహద్దుల్లో రష్యా యుద్ధ విమానాలు | రెస్టారెంట్‌కు వెళ్లిన దున్నపోతు..!(వీడియో)