విమానంలో వివాదం.. విండో సీట్ అడిగితే ఇవ్వలేదని యువతిపై మహిళ వేధింపులు..!
రైళ్లలో సీట్లు మార్చమని చాలా మంది ప్రయాణికులు తరచుగా అడుగుతుంటారు. రైళ్లలో ఇది నడుస్తుంది. కానీ, విమానాల్లో ఇది చాలా అరుదు.. ఎందుకంటే విమానాల్లో కిటికీ సీట్లకు ఎక్కువ డబ్బు చెల్లిస్తారు. అయితే, ఇటీవల ఒక యువతికి ఎదురైన అనుభవాన్ని ఆమె ఇంటర్‌నెట్‌లో షేర్ చేసింది. ఆమె కిటికీ సీటుపై కూర్చున్నప్పుడు మరొక మహిళ తన కొడుకు కోసం సీట్లు మార్చమని డిమాండ్ చేసింది. ఆ మహిళ నిరాకరించడంతో, ఆమె ప్రయాణం అంతా ఆమెను వేధించింది.

విమాన ప్రయాణ సమయంలో ప్రయాణీకులు తరచుగా తమకు నచ్చిన సీటును ముందుగానే బుక్ చేసుకుంటారు. కొందరు కిటికీ దగ్గర, మరికొందరు నడవ మీద కూర్చోవాలని కోరుకుంటారు. కానీ, కొన్నిసార్లు సీటు మార్చమని చేసిన ఈ అభ్యర్థన గొడవకు కారణమవుతుంది. అలాంటి ఒక కేసు ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేధికగా చర్చనీయాంశంగా మారింది. నివేదిక ప్రకారం, ఐదు గంటల విమాన ప్రయాణం కోసం తాను ముందుగానే విండో సీటును బుక్ చేసుకున్నానని, తద్వారా ప్రయాణంలో బయటి దృశ్యాన్ని చూడవచ్చని, నిద్రపోయేటప్పుడు కిటికీకి తల ఆనించుకోవచ్చని ఒక మహిళ చెప్పింది. కానీ ఆమె విమానం ఎక్కినప్పుడు, మరొక మహిళ తన టీనేజ్ కొడుకుతో వచ్చి సీటు మార్చమని కోరింది.
సదరు మహిళ తన కొడుకు కోసం కిటికీ పక్క సీటు అడిగింది. తన కొడుకు కిటికీలోంచి బయటకు చూడాలనుకుంటున్నాడని కోరింది. దానికి విండో సీట్‌లో ఉన్న మహిళ మర్యాదగా తిరస్కరించి, క్షమించండి, నేను నా సీటును ఇవ్వలేను, కావాలని నేను కూడా విండో సీట్ ఎంచుకున్నానని చెప్పింది. కానీ, ఎదురుగా ఉన్నమహిళ వినకుండా చిరాకుపడుతూ..ఏయ్, ఇది కేవలం ఒక సీటు, అంత కష్టపడకు అంటూ వాగ్వాదానికి దిగింది. దానికి ఆ మహిళ చిరునవ్వుతో, అయితే, ఇది కేవలం ఒక సీటు – అది కూడా నాది అంటూ సమాధానం ఇచ్చింది.
కానీ, ఈ ఇద్దరు ఆడవాళ్లు పక్క పక్కనే కూర్చుని ఉండటంతో ప్రయాణం మొత్తం విండో సీట్ మహిళకు వేధింపులు తప్పలేదు. పదే పదే ఆమెను మోచేయితో కొట్టడం, తన మొబైల్ ఫోన్ బ్రైట్‌నెస్ పెంచి మెసేజ్‌లు చేయటం, మాటి మాటికీ మండిపడుతూ ఉందని చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




