Viral Video: వావ్.. 82 ఏళ్ల బామ్మ బంగీ జంపింగ్… ఆ సినిమాలో చిరంజీవిని గుర్తు చేసిందిగా…
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఒక వీడియో నెటిజన్స్‌ను ఫిదా చేస్తోంది. ఆటలాడేందుకు బద్దకించే యువకులకు ఈ వీడియో చూపించాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో 82 ఏళ్ల వృద్ధురాలు బంగీ జంపింగ్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వృద్ద మహిళ శివపురిలో...

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఒక వీడియో నెటిజన్స్‌ను ఫిదా చేస్తోంది. ఆటలాడేందుకు బద్దకించే యువకులకు ఈ వీడియో చూపించాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో 82 ఏళ్ల వృద్ధురాలు బంగీ జంపింగ్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వృద్ద మహిళ శివపురిలో ‘భారతదేశంలో ఎత్తైన బంగీ జంప్’ చేసిందని చెబుతారు.
ఆమె ఉత్సాహంగా బంగీ జంపింగ్ స్టేషన్ నుండి దూకుతున్నట్లు క్లిప్‌లో చూపించారు. ఆ సమయంలో ఆమె ముఖంలో విశాలమైన చిరునవ్వు స్పష్టమైన థ్రిల్ కనిపిస్తుంది. ఆ మహిళ 117 అడుగుల ఎత్తు నుండి దూకింది. చాలా మంది ఆ మహిళ విశ్వాసాన్ని ఇష్టపడ్డారు. మరికొంత మంది ఆమె ధైర్యాన్ని ‘స్ఫూర్తిదాయకం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి:
View this post on Instagram
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘globesome.india’ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఈ పోస్ట్ 6 రోజుల క్రితం షేర్ చేయబడింది. నెటిజన్ల నుండి 3 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది.
