గోల్ఫ్ కోర్స్‌లో విమానం దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోల్ఫ్ కోర్స్‌లో విమానం ఒక్కసారిగా పడిపోయినట్లు ఈ వీడియోలో చూడవచ్చు. విమానం కూలిన ప్రదేశంలో అప్పటికే ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలోని హాగిన్ ఓక్స్ గోల్ఫ్ కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అయితే, ఇది ఒక చిన్న విమానం అని తెలిసింది. దీనిని సింగిల్-ఇంజిన్ పైపర్ PA28 అని పిలుస్తారు. పైలట్ తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా పైలట్ దానిపై నియంత్రణ కోల్పోయాడు. 400 అడుగుల ఎత్తులో ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ గోల్ఫ్ కోర్స్ ఫెయిర్‌వేలో దిగాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే విమానం ల్యాండ్ అయిన చోట ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వైరల్ వీడియోలో కనిపించింది.
గోల్ఫ్ కోర్స్ ఓపెన్, సురక్షితమైన ప్రదేశం కాబట్టి పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసాడు. ఈ ఘటనలో పైలట్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అనంతరం ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత విమానం నుంచి ఇంధనం లీకైనప్పటికీ మంటలు చెలరేగకపోవడం విశేషం.
The golfer got a second life!
A small plane crash-landed on a golf course in Sacramento, California, narrowly missing a golfer. The pilot, who had taken off from McClellan Air Force Base, experienced complete mechanical failure at around 400 feet (120m), according to the… pic.twitter.com/8nZb3E8m3W
— WhiteHouse (@WhiteHouseIce) August 5, 2024
అయితే, ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. విమానం ల్యాండింగ్ ప్రదేశం కాస్త ముందుకు జరిగి ఉంటే..ఆ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. నేలపై కూలిన తరువాత ఆ విమానం గోడను ఢీకొట్టి అక్కడే ఆగిపోయినట్లు బయటకు వచ్చిన వీడియోలో కనిపించింది. ఏదైనా నివాస ప్రాంతంలో పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.
ఈ సంఘటన జరిగిన తర్వాత గోల్ఫ్‌కోర్స్‌లో పెద్ద శబ్ధం వినబడిందని, కానీ, అది ఏమిటో మాకు అర్థం కాలేదని గోల్ఫ్ కోర్స్ ఉద్యోగి చెప్పారు. ఇంతకు ముందు ఇలాంటి ప్రమాదం చూడలేదన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..