అట్లుంటది మరీ కోతులతోని.. అరటి పండు కోసం వానర యుద్ధం.. ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు..

|

Dec 10, 2024 | 11:33 AM

సాంకేతిక లోపం, ట్రాక్ లేదా ఇంజన్ మరమ్మతు పనుల వల్ల లేదా ప్రకృతి వైపరీత్యాలు వంటి వివిధ కారణాల వల్ల రైలు అంతరాయం అనే వార్తలు మీరు వినే ఉంటారు. కొన్నిసార్లు పౌరుల నిరసనలు, సమ్మెలు కూడా రైళ్లు నడవడానికి ఆటంకం కలిగిస్తాయి. అయితే కోతుల వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఎప్పుడైనా విన్నారా? అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా ఆ స్టేషన్ నుంచి బయల్దేరి వెళ్లాల్సిన అన్ని రైళ్లకు కోతుల దండు అడ్డం పడిందంటే నమ్మాల్సిందే.. ! దీంతో అనేక రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అట్లుంటది మరీ కోతులతోని.. అరటి పండు కోసం వానర యుద్ధం.. ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు..
Fight Among Monkey
Follow us on

కోతి చేష్టలు అని ఊరికే అనరు. అలాంటి వానర చేష్టలతో ఓ రైల్వే స్టేషన్‌లో పెను విధ్వంసం సృష్టించాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విచిత్రమైన ఘటన బీహార్‌లోని సమష్టిపూర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. అరటిపండు కోసం రెండు కోతుల మధ్య జరిగిన గొడవతో పళ్లు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్టేషన్‌లోని ప్రయాణికులు అవాక్కయ్యారు. కోతులు చేసిన పనితో స్టేషన్‌లో కరెంటు వైర్లు తెగపడి.. రైలుపై పడ్డాయి.

ఓ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఈ కోతులు..వాటికి దొరికిన అరటి పండు కోసం తలపడ్డాయి. ఈ క్రమంలో ఒకదానిపై ఒకటి దాడి చేసుకుని.. అక్కడ ఉన్న వస్తువులను విసురుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓ కోతి ప్లాస్టిక్ వస్తువు లాంటిది మరొక దానిపై విసిరింది. అది దానికి తగలకుండా నేరుగా విద్యుత్ వైర్లను తాకింది. ఇక అంతే షార్ట్ సర్క్యూట్ అయ్యింది. నిప్పు రవ్వలు విరజిమ్మాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కంట్రోల్ రూంను అలర్ట్‌ చేసింది. మరింత నష్టం, ప్రమాదం జరగకుండా ఓవర్ హెడ్ వైర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందుకున్న ఓవర్ హెడ్ ఎక్విప్ మెంట్ విభాగం సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వైర్లను సరిచేశారు. మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత ఉదయం 9.30 గంటలకు రైళ్ల రాకపోకలు సాగించాయి.. ఈ ప్రమాదం కారణంగా 4 నుంచి 14వ మార్గం వరకు దాదాపు 30 నిమిషాల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అప్పటి వరకు రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. కోతుల పోరుతో అలజడి నెలకొంది. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. పరిస్థితి అదుపులోనే ఉందని, రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..