
ఢిల్లీ మెట్రో తన ప్రయాణీకులను , సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ విఫలం కాదు., ఎందుకంటే రైలు లోపల జరిగిన అసాధారణ సంఘటనల వీడియోలు దాదాపు ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తునే ఉంటాయి. ఈ వీడియోలు తరచుగా వీక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. సోషల్ మీడియాలో చర్చకు, మీమ్స్‌కు దారితీస్తాయి. ఢిల్లీ మెట్రో రైలు లోపలజరిగిన మరో షాకింగ్ వీడియో బయటపడింది, ఇందులో ఇద్దరు మహిళలు సీటు కోసం తీవ్రంగా పోరాడుతున్నట్లు కనిపిస్తోంది.
ఢిల్లీ మెట్రో రైలు లోపల మహిళలు గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు ఒకరు లాగుతున్నట్లు కనిపిస్తోంది. ఒక మహిళ సీటు కోసం గొడవ పడుతుండగా..వారిలో ఒకరు మరొకరిని సీటుమీదకు తోసేశారు.. ఆపై వారిద్దరూ తమ శక్తి కొద్దీ ఒకరి జుట్టుని ఒకరు లాగడం ప్రారంభించారు.
Kalesh between two ladies inside kaleshi Delhi Metro over seat issues pic.twitter.com/tny8m7TSIx
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 23, 2025
ఇద్దరు మహిళలు ఒకరినొకరు లాక్కుంటున్నారు. మెట్రో రైలు తన గమ్య స్థానం వచ్చినప్పుడు తలుపు తెరుచుకుంటున్నాయి. అయినా వీరిద్దరూ గొడవ పడుతూ ఉన్నారు. కొంతమంది ప్రయాణికులు వీరిని పట్టించుకోకుండా రైలు నుండి దిగుతున్నారు. అయితే మరో మహిళ జోక్యం చేసుకుని వీరిద్దరిని వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆమె కొంతసేపు ప్రయత్నించింది. అయితే వారు ఒకరి జుట్టును ఒకరు వదలలేదు. వీడియో ముగిసే సమయానికి వారి జుట్టును లాగుతూనే ఉన్నారు.
ఈ సంఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశం , సమయం తెలియలేదు, అయితే ఈ వీడియో ఢిల్లీ మెట్రో రైలు లోపల జరిగింది అని చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇంటర్నెట్ వినియోగదారులు ఢిల్లీ వాసులను లక్ష్యంగా చేసుకుని రకరకాల కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..