Viral Video: మనిషైనా, జంతువైనా పెళ్ళానికి భయపడాల్సిందే.. వీడియో చూసి నవ్వి, నవ్వి అడ్డం పడితే మాకేం సంబంధంలే..
Trending Video: సోషల్ మీడియాలో ఓ గోరిల్లాకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. నేను పక్కన ఉండగానే మరో అమ్మాయిని టచ్ చేస్తావా అంటూ మగ గొరిల్లాను పొట్టుపొట్టుగా కొట్టేసింది. ఈ వీడియో చూసిన వారంతా నవ్వుల్లో మునిగిపోతున్నారు. "పక్కన నేనుండగా వేరే అమ్మాయిని టచ్ చేస్తావా?" అంటూ ఆడ గొరిల్లా తరపున సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. తాజాగా, ఓ గొరిల్లాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జూకు వచ్చిన ఓ యువతి జుట్టు పట్టుకుని ముద్దుచేసిన మగ గొరిల్లాకు, ఓ ఆడ గొరిల్లా దేహశుద్ధి చేసిన సంఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు “పక్కన నేనుండగా వేరే అమ్మాయిని టచ్ చేస్తావా?” అంటూ ఆడ గొరిల్లా తరపున సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
వివరాల్లోకి వెళితే, ఓ జంతు ప్రదర్శనశాలలో గొరిల్లాల ఎన్‌క్లోజర్ వద్ద ఓ యువతి నిల్చుని వాటిని చూస్తోంది. ఇంతలో ఓ మగ గొరిల్లా అకస్మాత్తుగా ఆ యువతి జుట్టును పట్టుకుని ముద్దు చేసింది. ఈ పరిణామంలో యువతి నార్మల్‌గానే కనిపించింది. కానీ, ఇది గమనించిన ఓ ఆడ గొరిల్లా వెంటనే అక్కడికి దూసుకొచ్చింది. పై నుంచి దొర్లుకుంటూ వచ్చి మగ గొరిల్లాపై దాడి చేసింది. దానిని వెనక్కి లాగిపడేసింది. అంతటితో ఆగకుండా, మగ గొరిల్లాను పొట్టు పొట్టుగా కొట్టింది. ఈ అనూహ్య ఘటనను అక్కడున్న పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు.
సోషల్ మీడియాలో వైరల్..
Male Gorilla grabs Girls Hair, Gets Beaten by his Female Gorilla 🤣 pic.twitter.com/uZG5Fo3gqG
— Rosy (@rose_k01) July 11, 2025
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ఆడ గొరిల్లా ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఆడ గొరిల్లాకు భార్యగా ఉండే లక్షణాలున్నాయి,” అని ఒకరు, “తప్పు చేస్తే భర్తకు బుద్ధి చెప్పిన భార్య,” అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. మరికొందరు “మనుషుల్లోనే కాదు, జంతువుల్లోనూ ఆడవాళ్లపై వేధింపులకు వ్యతిరేకత ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం” అని కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
