AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్

షాపింగ్ మాల్‌పై దాడి చేసి భారీ ప్రాణనష్టం నమోదు చేయాలని ప్లాన్ చేసిన 18 ఏళ్ల యువకుడిని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అరెస్ట్ చేసింది. దాదాపు రెండేళ్లుగా అతడి కదలికలపై నిఘా పెట్టిన అధికారులు.. చివరకు అండర్‌కవర్ ఆపరేషన్‌లో భాగంగా అతడికి AK-47 తుపాకీ, 200 రౌండ్ల బుల్లెట్లు విక్రయించి, కొనుగోలు చేసిన వెంటనే అరెస్ట్ చేసారు.

షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్
Fbi Arrests Teen For Planning Attack On Mall Of America
Sharada V
|

Updated on: Oct 08, 2026 | 10:48 AM

Share

మొహముద్‌పై FBIకి 2024 డిసెంబర్‌లోనే అనుమానం వచ్చింది.  ఓ రహస్య వ్యక్తికి అతడు మెసేజ్‌లు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తొలుత సోమాలియాకు వెళ్లి అల్-షబాబ్ మిలిటెంట్లలో చేరాలని ఆసక్తి చూపాడు. సోమాలియాకు వెళ్లేందుకు అవసరమైనంత డబ్బు తన వద్ద లేదని  ఇస్లామిక్ స్టేట్‌ ఐసిస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసాడు.

30 నుంచి 60 మందిని చంపాలని..

అక్టోబర్ 24న మాల్‌లో హమాంగ్ గిరిజన సమూహం ఆధ్వర్యంలో జరగనున్న ఆర్ట్స్ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని  మాల్ ఆఫ్ అమెరికాపై దాడి చేసి భారీ సంఖ్యలో ముస్లిమేతరులను హతమార్చాలని ప్లాన్ చేసాడు. అండర్‌కవర్ ఆపరేషన్‌కు వినియోగించిన ఓ FBI ఉద్యోగి తనను తాను ఇస్లామిక్ స్టేట్ ఐసిస్‌ సభ్యుడని పరిచయం చేసుకున్నాడు.  మొహముద్ అతని వద్ద ఒక AK-47, 200 రౌండ్ల మందుగుండు సామగ్రిని 600 డాలర్లకు కొనుగోలు చేశాడు. నువ్వు దాడి చేయడం నిజమేనా అని ఇన్ఫార్మర్ ప్రశ్నించగా.. తాను వంద శాతం సిద్ధంగా ఉన్నానని మొహముద్ మెసేజ్ చేసాడు. ఆయుధాలు చేతికి అందిన వెంటనే అధికారులు మొహముద్ ను అదుపులోకి తీసుకున్నారు. మిన్నెసోటా రాష్ట్రం రిచ్‌ఫీల్డ్‌లోని పబ్లిక్ పార్క్ లో అరెస్ట్ చేశారు.

‘తల్లిదండ్రులు హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోవాలి’

మొహముద్‌పై రెండేళ్ల పాటు నిఘా పెట్టిన FBI అధికారులు 2025 మేలో  అతడి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అతడి తల్లి.. తన కుమారుడు స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదని చెప్పింది.  ఆమె అతడి తండ్రికి ఫోన్ చేయగా.. FBI అధికారులతో మాట్లాడేందుకు నిరాకరించి, వారి వివరాలను తన లాయర్‌కు ఇస్తాననీ చెప్పిన తండ్రి తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు.  సోమాలియా మూలాలకు చెందిన మొహముద్ అమెరికా పౌరుడైనప్పటికీ తీవ్రవాద భావజాలానికి ప్రభావితమయ్యాడనీ మాల్‌ లో దాడి చేసి ఉంటే 30 నుంచి 60 మందిని చంపే అవకాశం ఉందని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్ డేనియల్ రోసెన్ విస్తుపోయే అంశాన్ని బయటపెట్టారు. ‘పిల్లలు తీవ్రవాద భావజాలం వైపు వెళ్తున్నారనే సంకేతాలు కనిపించినా.. ఆ విషయాన్ని ఫెడరల్ అధికారులు హెచ్చరించినా.. తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకోవాల’ని రోసెన్ గట్టిగా చెప్పారు.

సెయింట్ పాల్‌లోని ఫెడరల్ కోర్టులో అతడిని హాజరుపరచగా తనకు ఉద్యోగం, ఇల్లు, కారు లేవని, బ్యాంకులో డబ్బు కూడా లేదని జడ్జి ముందు చెప్పాడు.  కుటుంబ సభ్యులు, న్యాయవాది ఈ కేసుపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. మిన్నెసోటాలో సోమాలియా మూలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. 1990లలో శరణార్థులుగా అమెరికాకు వచ్చి ఈ సమాజం అక్కడ విస్తరించింది. గతంలో కూడా కొందరు మిలిటెంట్ సంస్థల్లో చేరేందుకు ప్రయత్నించి పలు కేసుల్లో అరెస్టయ్యారు.

Follow Us
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..