పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిది. తొమ్మిది మాసాలు మోసిన తల్లి ప్రేమ గొప్పదో..ఆ తర్వాత 20 ఏళ్లు తమ గుండెలపై పిల్లలు పెంచి.. తీర్చిదిద్దే బాధ్యత మోసే తండ్రి ప్రేమ కూడా అంతే. తమ పిల్లల కోసం ఎంతటి క్లిష్ట పరిస్థితులలైనా ఎదుర్కోని.. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేదే ప్రతి తండ్రి (Father) తపన. చిన్న దెబ్బ తగిలిన తట్టుకోలేని ప్రేమ అమ్మది అయితే.. చిన్న గాయాన్ని కూడా పిల్లలకు తగలకూడదని.. నిత్యం కాపాడుకునే ప్రేమ నాన్నది. తమ కళ్ల ముందే తమ పిల్లల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిస్తే.. తమ ప్రాణాలను అడ్డువేసి అయినా సరే తమ పిల్లలను రక్షించుకుంటాడు. తాజాగా ఓ తండ్రి కూడా అదే పని చేశాడు. కొడుకు ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఏకంగా తన ప్రాణాలనే ఫణంగా పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టెక్సాస్‌లో రోడియోలో కోడి హుక్స్ ఈవెంట్స్ జరుగుతున్న సమయంలో అందులో ఓ వ్యక్తి పాల్గోన్నాడు. అతను ఎద్దుపై కూర్చోని మైదానంలోకి ఎంట్రీ ఇవ్వగానే.. ఆ ఎద్దుకు ఒక్కసారిగా కోపం వచ్చింది. వెంటనే… తనపై ఉన్న వ్యక్తిని కిందపడేసింది. దీంతో అతని తలపై నెలకు తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆ ఎద్దును కట్టడి చేసేందుకు మిగతా సభ్యులు ప్రయత్నించారు. కానీ ఎద్దును కంట్రోల్ చేయలేకపోయారు. ఆ తర్వాత ఎద్దు మరోసారి కిందపడిన వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో అక్కడే ఉన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా గ్రౌండ్లో తన కొడుకుపై పడుకున్నాడు. దీంతో ఎద్దు ఢీకొట్టినప్పుడు తన కొడుకుకు ఏం కాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కొడుకు ప్రాణాలను కాపాడడం కోసం సహాయం చేసిన ఇతర ఎద్దు ఫైటర్లకు ఆ తండ్రి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ తండ్రి ప్రేమకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
Also Read: Samantha: సమంతకు దూకుడెక్కువ.. షాకింగ్ విషయాలను చెప్పిన ట్రైనర్ జునైద్..
Srivalli Song: శ్రీవల్లీ సాంగ్ బెంగాలీ వెర్షన్ విన్నారా ?.. అదిరిపోయిందిగా..
Ajith: వలిమై తర్వాత స్టైల్ మార్చిన అజిత్.. న్యూలుక్ అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్..
Bhagya shree : ప్రభాస్ వాటిని బాగా మెయింటేన్ చేస్తాడు.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన బాలీవుడ్ నటి