Watch Video: కిక్కు కోసం.. 5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు.. !

|

Apr 25, 2024 | 3:52 PM

తన వంట నైపుణ్యాలను ప్రత్యేకమైన రీతిలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. విలాసవంతమైన హోటల్‌లో ఉద్యోగం వదిలిపెట్టి, రోడ్డు పక్కనే చిన్న దాబా తెరవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఎందుకు ఇలా చేయాలని నిర్ణయించుకున్నాడో కూడా వీడియోలో వివరించాడు. మాజీ మారియట్‌ దబాకు వచ్చిన బ్లాగర్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అడిగినప్పుడు.. అతడు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

Watch Video: కిక్కు కోసం.. 5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు.. !
Ex 5 Star Hotel Chef
Follow us on

మారియట్‌లో పని చేసే ఒక చెఫ్ తన వంట నైపుణ్యాలను వీధుల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. ఫ్యాన్సీ కిచెన్‌లు, పాష్‌ హోటళ్లకు బదులు రోడ్డు పక్కన ఓ చిన్న దాబా ఏర్పాటు చేశాడు. పైగా, అతడు తయారు చేసే వంటకాల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదు. అయితే, ఈ వార్త దావానంలా వ్యాపించింది. దాంతో ఒక ఫుడ్ వ్లాగర్ ఇటీవల రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఆ చెఫ్‌ దాబాను సందర్శించారు. చెఫ్ ఒకపెద్ద బట్టీ పోయిలో రోటీలు తయారు చేస్తుండటం గమనించాడు.. మాజీ మారియట్ చెఫ్‌గా విధులు నిర్వహించిన అతడు.. ఇప్పుడిలా వీధి పక్కన చెఫ్‌గా ఎందుకు పనిచేస్తున్నారని వ్లాగర్ అడిగినప్పుడు..ఆ చెఫ్ ఏమి చెప్పాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ మాజీ మారియట్‌ చెఫ్‌ ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ స్టాల్ ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

చండీగఢ్‌లోని ఈ దాబా యజమాని మారియట్‌లో చెఫ్‌గా పనిచేసేవాడు. కానీ, అతడు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, తన వంట నైపుణ్యాలను ప్రత్యేకమైన రీతిలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. విలాసవంతమైన హోటల్‌లో ఉద్యోగం వదిలిపెట్టి, రోడ్డు పక్కనే చిన్న దాబా తెరవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఎందుకు ఇలా చేయాలని నిర్ణయించుకున్నాడో కూడా వీడియోలో వివరించాడు.

ఇవి కూడా చదవండి

మాజీ మారియట్‌ దబాకు వచ్చిన బ్లాగర్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అడిగినప్పుడు.. అతడు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇక్కడ పనిచేయటం నాకు సంతోషాన్ని, తృప్తిని ఇస్తుందని చెప్పాడు. హోటల్‌లో పనిచేసినప్పుడు డబ్బు మాత్రమే వచ్చేదని, కానీ ఇప్పుడు తను సొంతంగా దాబా ఏర్పాటు చేసుకుని కష్టపడుతున్నప్పుడు డబ్బు మాత్రమే కాదు.. ప్రజల ప్రేమ కూడా లభిస్తోందని చెప్పాడు.

ఈ వీడియో Instagram ఖాతా @foodpandits నుండి సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఈ చెఫ్ ధాబా చండీగఢ్‌లో ‘రన్నింగ్ ధాబా ఆన్ స్ట్రీట్స్’గా ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ రోజు కోసం ప్రత్యేక మెనూని నిర్ణయించి నాలుగు భాగాలుగా ఉన్నొక స్టీల్ ప్లేట్లలో తందూర్‌ రోటీలు, పప్పు, దాల్ మఖానీ, మత్తర్ పనీర్, బూందీ రైతా వడ్డించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..