Watch Video: బర్లు, గొర్లు అనుకున్నవానే కాకా.. అట్టా పోతున్నావ్.. సింహాలే బిత్తరపోయి చూశాయి..!

|

Jul 28, 2023 | 9:34 PM

సాధారణంగా కొందరు కుక్కలను చూస్తేనే హడలిపోతారు. అలాంటి ఏదైనా క్రూర మృగం ఎదురైతే? అందులోనూ మందకు మందగా సింహాలు కాపుకాస్తూ ఉంటే? బాబోయ్ వాటిని చూడగానే పై ప్రాణాలు పైకే పోతాయి. కానీ, కొందరుంటారు సామీ..

Watch Video: బర్లు, గొర్లు అనుకున్నవానే కాకా.. అట్టా పోతున్నావ్.. సింహాలే బిత్తరపోయి చూశాయి..!
Lion Safari
Follow us on

సాధారణంగా కొందరు కుక్కలను చూస్తేనే హడలిపోతారు. అలాంటి ఏదైనా క్రూర మృగం ఎదురైతే? అందులోనూ మందకు మందగా సింహాలు కాపుకాస్తూ ఉంటే? బాబోయ్ వాటిని చూడగానే పై ప్రాణాలు పైకే పోతాయి. కానీ, కొందరుంటారు సామీ.. భయమా? నాకా? అని చెబుతుంటారు. చెప్పడమే కాదు.. తమ ధైర్యాన్ని చేతల్లోనూ చూపిస్తారు. తాజాగా అలాంటి వ్యక్తికి నిదర్శనమైన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆ వ్యక్తి ధైర్యం చూస్తే.. రెండు కళ్లు పెద్దవి చేసి మరీ చూస్తారు. అవును మరి. అడవికి రాజు సింహం. అంతటి బలమైన, శక్తివంతమైన సింహానికి ఎదురు ఎవరైనా పోతారా? వాహనంలో ఉన్నప్పటికీ.. అది సమీపిస్తే దడుసుకుని చస్తారు. అలాంటి సింహం దగ్గర నుంచి.. కాదు కాదు.. సింహాల మంద దగ్గర నుంచి వెళ్లడం మామూలు విషయం కాదు. ఈ వీడియోలోని వ్యక్తి అదే చేశాడు. సింహాల మంద అక్కడే వేట సాగించి, ఆహారం తింటుండగా.. ఓ వ్యక్తి మాత్రం అసలు అక్కడ ఏమీ లేనట్లు, తనకు ఏమీ తెలియనట్లు తీరిగ్గా వెళ్లిపోయాడు.

వైరల్ అవుతున్న వీడియోలో జంగిల్ సఫారీలో కొందరు పర్యాటకులు సింహాలను వీక్షిస్తున్నారు. ఆ సమయంలోనే సింహాల మంద ఓ జంతువును వేటాడి తింటున్నారు. ఇంతలోనే మరో షాకింగ్ సీన్ వారి కంట పడింది. అదేంటంటే.. ఓ వ్యక్తి బైక్‌పై ఏవో మూటలు పెట్టుకుని వస్తున్నాడు. అది కూడా ఆ సింహా మంద మధ్యలోంచి అతను బైక్‌పై హాయిగా వెళ్లాడు. అతను అలా వెళ్తుండగా.. సింహాలు అతన్నీ ఆశ్చర్యంగా, వింత చూశాయి. కానీ, అతను మాత్రం ఏమాత్రం భయపడకుండా ప్రశాంతంగా తన దారిన తాను వెళ్లిపోయాడు. ఇక ఈ సీన్‌ను చూసిన సఫారీ వాహనంలో కూర్చున్న పర్యాటకులు బిత్తరపోయారు. అతని గుండె ధైర్యానికి సలామ్ కొడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అతను అలా బైక్‌పై వెళ్తున్న దృశ్యాన్ని తమ కెమెరాల్లో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. అవేమైనా బర్లు, గొర్లు, కుక్కలు, నక్కలు అనుకున్నాడా ఏందీ.. సింహాల మంద ముందు అంత ధైర్యంగా ఎలా ముందుకెళ్తున్నావ్ సామీ అని కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..