Viral News: ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన, చిత్ర విచిత్ర అలవాట్లు, అభిరుచులు ఉంటాయి. అయితే, వారి వారి అలవాట్ల కారణంగా కొందరు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తుంటారు. అలాంటి వారి గురించి తెలుసుకునేందుకు జనాలు కూడా చాలా ఆసక్తి కనబరుస్తుంటారు. అదే సమయంలో ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తుంటారు. అయితే, తాజాగా ఓ వ్యక్తికి ఉన్న వింత అలవాటు గురించి తన భార్య యావత్ ప్రపంచానికి తెలియజేసింది. 50 ఏళ్ల నుంచి తన భర్త పచ్చి మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నాడని తెలిసి.. భార్య షాక్ అయ్యింది. అతని అలవాటును ఎలా మార్చాలా? అని తాపత్రయపడుతూ.. సోషల్ మీడియాను ఆశ్రయించింది. వివరాలన్నీ వెల్లడిస్తూ నెటిజన్ల సలహాలు, సూచనలు కోరింది. ప్రస్తుం ఈ వ్యవహారం నెట్టింట్లో రచ్చరచ్చ చేస్తోంది.
వివరాల్లోకెళితే.. ఇంగ్లండ్ లింకన్‌షైర్‌లోని బోస్టన్ నివాసి అయిన పీటర్ రిచర్డ్‌సన్ ఎనిమిది సంవత్సరాల క్రితం కేటీ చామర్స్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ ఆ సమయంలో తన భర్తకు ఉన్న వింత అలవాటు గురించి చామర్స్‌కి తెలియదు. ఆమె నాన్‌వెజ్ వంట చేసినప్పుడల్లా పీటర్ అసలు భోజనమే చేసేవాడు కాదు. దాంతో ఆమె తన భర్త శాఖాహారి అని భావించింది. కానీ, ఆ తరువాత అతని అభిరుచి తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. తన భర్తకు పచ్చి మాంసం తినడం ఇష్టం అని, 50 ఏళ్లుగా పచ్చి మాంసాన్ని తింటున్నాడని తెలుసుకున్న ఆమెకు మైండ్ బ్లాంక్ అయ్యింది. మనుషులు ఇలా కూడా ఉంటారా? అని కాసేపు నిశ్చేష్టురాలైంది.
భర్త వింత అలవాటు గురించి చామర్స్ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్త పీటర్ పచ్చి మాంసాన్ని తినడానికి ఇష్టపడుతాడని, ఐదు సంవత్సరాల వయస్సు నుంచే అతనికి ఈ అలవాటు ఉందని తెలిపింది. అయితే, పీటర్ తన వింత అలవాటుకు ఒక కారణం చెప్పాడు. తాను చిన్నప్పుడు ఏదో తప్పు చేస్తే.. శిక్షగా తన తల్లి పచ్చిమాంసం తినిపించిందని చెప్పాడు. ఆ సమయంలో పచ్చి మాంసం రుచిగా అనిపిపంచడం.. అలా అలా అది కంటిన్యూ అయ్యిందని వివరించాడు. ఇదే విషయాన్ని నెటిజన్లకు చామర్స్ వివరించింది. తన భర్త పీటర్‌కు ఉన్న ఈ వింత అలవాటును మాన్పించేందుకు ఏం చేయాలంటూ నెటిజన్లను సలహాలు కోరింది. దీనికి స్పందించిన నెటిజన్లు.. పీటర్‌ను వెంటనే డాక్టర్‌కు చూపించాలని సూచించారు. పచ్చి మాంసం తింటున్న కారణంగా పీటర్‌కు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.
Also read:
Telangana News: భూమి నుంచి ఒక్కసారిగా ఉబికి బయటకు వచ్చిన నీటి సంపు.. షాక్ అయిన గ్రామస్తులు..