బెన్‌ స్టోక్స్‌‌ జెర్సీపై భారతీయ సంతతి డాక్టర్‌ పేరు.. ఫొటో వైరల్‌

కరోనా వైరస్‌ని అరికట్టే క్రమంలో ముందు వరుసలో నిలిచారు వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రపంచ వ్యాప్తంగా వీరు సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలో హెల్త్‌కేర్‌ వర్కర్లకు తమదైన శైలిలో అభినందనలు తెలిపారు ఇంగ్లండ్ క్రికెటర్లు. ఇంగ్లండ్‌లో కీలక సేవలు అందిస్తోన్న డాక్టర్ల పేర్లను తమ జెర్సీపై వేయించుకొని ‘రైజ్‌ ద బ్యాట్’ అనే‌ క్యాంపన్‌ను వారు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారతీయ సంతతికి చెందిన డాక్టర్‌ వికాష్ కుమార్‌ […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:47 pm, Fri, 10 July 20
బెన్‌ స్టోక్స్‌‌ జెర్సీపై భారతీయ సంతతి డాక్టర్‌ పేరు.. ఫొటో వైరల్‌

కరోనా వైరస్‌ని అరికట్టే క్రమంలో ముందు వరుసలో నిలిచారు వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రపంచ వ్యాప్తంగా వీరు సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలో హెల్త్‌కేర్‌ వర్కర్లకు తమదైన శైలిలో అభినందనలు తెలిపారు ఇంగ్లండ్ క్రికెటర్లు. ఇంగ్లండ్‌లో కీలక సేవలు అందిస్తోన్న డాక్టర్ల పేర్లను తమ జెర్సీపై వేయించుకొని ‘రైజ్‌ ద బ్యాట్’ అనే‌ క్యాంపన్‌ను వారు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారతీయ సంతతికి చెందిన డాక్టర్‌ వికాష్ కుమార్‌ పేరును ఉన్న జెర్సీని ధరించారు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌‌. వికాష్ కుమార్‌ దుర్హమ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్‌ ట్రస్ట్‌(ఎన్‌హెచ్‌ఎస్‌)లో క్రిటికల్ కేర్‌ విభాగంలో పనిచేస్తుండగా.. ఆయన సేవలకు గుర్తుగా స్ట్రోక్‌ ఈ విధంగా అభినందనలు తెలిపారు.

ఈ విషయం తెలిసిన వికాష్‌ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ”ఇది చాలా క్లిష్టమైన సమయం. ఎన్‌హెచ్‌ఎస్‌లో ఎంతోమంది వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మాకు ఇలాంటి అరుదైన గౌరవం లభించడం చాలా ఆనందించదగ్గ విషయం” అని అన్నారు. తాను కూడా క్రికెట్‌ అభిమాని అని, కాలేజీ వయస్సులో క్రికెట్‌ ఆడేవాడినని వికాష్ తెలిపారు. అయితే తమ కుటుంబంలో అందరూ విద్యావంతులు ఉండటం వలన చదువుకొని డాక్టర్‌ని అయ్యానని వివరించారు. ఇక వికాష్‌ వీడియోపై స్పందించిన స్టోక్స్‌.. ”ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. మీరు క్రికెట్‌లోకి రావాలని కోరుకుంటున్నా. ఇక్కడ వీలైనన్ని పరుగులు చేయాలి. వికెట్లు తీయాలి” అని అన్నారు. కాగా వికాష్‌ పేరుతో పాటు భారతీయ సంతతికి చెందిన డా.జామాస్ప్‌ కైఖుస్రో దస్తూర్‌, హరికృష్ణ షా, కృష్ణన్‌ అగాధా పేర్లను కూడా జెర్సీలపై ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరుగుతున్నటెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు భారతీయ సంతతి డాక్టర్ల పేర్లు ఉన్న జెర్సీలను ధరించనున్నారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయ డాక్టర్లు, నర్సులు అక్కడే తమ సేవలను అందిస్తున్నారు. దీంతో పలువురు వారిపై ప్రశంసలు కురిపిస్తోన్న విషయం తెలిసిందే.