Viral News: పువ్వు నుంచి కుళ్లిన శవం వాసన.. సెల్ఫీల కోసం క్యూ కడుతోన్న జనం..

|

Jun 16, 2021 | 8:44 PM

పరిమళించే పువ్వుల వాసనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. కానీ అదే పువ్వుల నుంచి దుర్వాసన వచ్చిందంటే మాత్రం.. దానిని ఆమడదూరం పెడుతుంటాం.

Viral News: పువ్వు నుంచి కుళ్లిన శవం వాసన.. సెల్ఫీల కోసం క్యూ కడుతోన్న జనం..
Viral Flower
Follow us on

పరిమళించే పువ్వుల వాసనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. కానీ అదే పువ్వుల నుంచి దుర్వాసన వచ్చిందంటే మాత్రం.. దానిని ఆమడదూరం పెడుతుంటాం. అయితే తాజాగా పోలాండ్‌ వికసించిన ఓ దుర్వాసన వచ్చే పువ్వును చూసేందుకు జనం క్యూ కట్టారు. అంతేకాదు, ఆ పువ్వుతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. కుళ్లిన మాంసం వాసన వచ్చే, ఈ పువ్వు వార్సా యూనివర్సిటీలోని బొటానికల్‌ గ్యార్డెన్స్‌లో వికసించింది.

గబ్బు వాసన వచ్చే ఈ పువ్వు పేరు.. అమోర్పోఫాలస్‌ టైటనం. అయితే పుష్పం చాలా అరుదుగా పూస్తుందని తెలిపారు యూనివర్శిటీ అధికారులు. అంతరించిపోతున్న సుమత్రన్ టైటాన్ అరుమ్ అనే పుష్పం మాంసాన్ని తినిపించే పరాగసంపర్క కీటకాలను ఆకర్షించడానికి కుళ్లిన శవం వాసనను విడుదల చేస్తుందని తెలిపారు. 1889లో లండన్‌లోని రాయల్‌ బొటానికల్‌ గార్డెన్స్‌లో వికసింది. ఆ తర్వత అమెరికాలో వికసించి, ఇప్పుడు తాజాగా.. పోలాండ్‌లో కనిపించింది. ఇంతటీ అరుదైన ఈ పుష్పాన్ని చూసేందుకు జనం తరలివచ్చారు.

Also Read:

ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి

 కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..