Viral Video: గుక్క పెట్టి ఏడుస్తున్న కోడిపల్ల.. ఇక శాకాహారులమే అంటున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో మీకోసం..

Viral Video: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టర్కీ చికెన్ వీడియో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వీడియోలో టర్కీ(కోడి జాతి)ని చూడగానే ఏదో బాధతో విలపిస్తున్నట్లు అనిపిస్తుంది.

Viral Video: గుక్క పెట్టి ఏడుస్తున్న కోడిపల్ల.. ఇక శాకాహారులమే అంటున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో మీకోసం..
Chicken
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 26, 2021 | 6:59 AM

Viral Video: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టర్కీ చికెన్ వీడియో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వీడియోలో టర్కీ(కోడి జాతి)ని చూడగానే ఏదో బాధతో విలపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియో చూసి చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. దాని బాధాతప్ప హావభావాలనుు చూసి.. ఇక నుంచి మేం శాకాహారులుగా మారిపోయామంటూ ప్రకటించేశారు.

నవంబర్ 24న జాన్ ఒబెర్గ్(@JohnOberg) అనే ట్విట్టర్ యూజర్.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఎవరైనా టర్కీ చికెన్ తినాలని ప్లాన్ చేస్తే, ఈ వీడియో చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాలను మార్చుకుంటారు.’’ అని క్యాప్షన్ పెట్టారు. జాన్ షేర్ చేసిన ఈ పోస్ట్‌ను సుమారు వేలాది మంది రీట్వీట్ చేయగా, 2.5 వేల మంది దీన్ని లైక్ చేశారు. 60 వేల మంది వరకు వీక్షించారు. సాధారణంగా ఫుడ్, డ్రింక్స్ విషయంలో ప్రతి ఒక్కరికీ వారి స్వంత అభిప్రాయం ఉంటుంది. కొందరికి నాన్ వెజ్ అంటే ఇష్టం, మరికొందరికి వెజ్ అంటే ఇష్టం. చాలా మంది చికెన్ తినడానికి ఇష్టపడతారు. అయితే జాన్ ఒబెర్గ్ చేసిన ఈ వీడియో పోస్ట్ తర్వాత, చాలా మంది మాంసాహారులు కూడా ఎమోషనల్ అయ్యారు. తమ అభిప్రాయాన్ని మార్చేసుకున్నారు. ఇంతకీ ఆ వీడియో అంతలా ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

వీడియోలో టర్కీ చికెన్.. ఒక వ్యక్తి ఒడిలో కళ్ళు మూసుకుని పడుకుంటుంది. ఈ కోడిపిల్లను చూస్తే ఉలిక్కిపడి ఏడుస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. తాను సురక్షితమైన ప్లేస్‌ ఉన్నట్లు ఆ కోడి భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది. వీడియోలోని వ్యక్తి కోడి తలపై చేయితో ఓదారుస్తున్నట్లు నిమురుతుండగా.. అది హాయిగా సేద తీరింది. 19 సెకన్ల ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఈ వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘ఈ వీడియో చూసిన తరువాత నాకు కన్నీళ్లు వచ్చాయి.’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ఇక నుంచి తాను శాకాహారిగా మారిపోతున్నట్లు ప్రకటించారు మరో నెటిజన్.

Viral Video:

Also read:

Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే..

Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..

Flashback: చీరకట్టులో అనసూయ.. రొమాంటిక్‌గా రెజీనా, ప్రభుదేవా.. ఆకట్టుకుంటోన్న ఫ్లాష్‌బ్యాక్‌ కొత్త పోస్టర్లు..