Viral Video: పరుపుపై పడుకోవడానికి పిల్ల ఏనుగు పోరాటం.. జూ కీపర్‌తో అమీతుమీ.. నవ్వులు పూయిస్తోన్న వైరల్‌ వీడియో..

|

May 17, 2022 | 8:17 PM

Viral Video: సాధారణంగా ఏనుగులు మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అయితే ఇందులో ఓ పిల్ల ఏనుగు మాత్రం పరుపు కోసం ఫైట్ చేసింది.

Viral Video: పరుపుపై పడుకోవడానికి పిల్ల ఏనుగు పోరాటం.. జూ కీపర్‌తో అమీతుమీ.. నవ్వులు పూయిస్తోన్న వైరల్‌ వీడియో..
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. సాధారణంగా ఏనుగులు మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అయితే ఇందులో ఓ పిల్ల ఏనుగు మాత్రం పరుపు కోసం ఫైట్ చేసింది. అది కూడా తోటి ఏనుగులతో, ఇతర జంతువులతో కాదు. జూ సంరక్షణ బాధ్యతలు చూసే కీపర్‌తో. పరుపు మీద పడుకోవడానికి వారిద్దరూ చేసే ఫైట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. నెటిజన్లతో నవ్వులు తెప్పిస్తోంది. ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్‌ సామ్రాట్ గౌడ త‌న ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్‌ చేస్తూ ‘ హేయ్ ద‌ట్స్ మై బెడ్.. గెట‌ప్’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు.

పిల్ల ఏనుగు పోరు భరించలేక..

వీడియోలో ముందుగా ఓ పిల్ల ఏనుగు కంచెను దాటేందుకు చాలా కష్టపడుతుంది. ఎలాగో దానిని దాటుకుని ముందుకు వస్తుంది. అక్కడ పరుపుపై పడుకున్న జూ కీపర్ ను లేపేందుకు ప్రయత్నిస్తుంటుంది అయితే అతను లేవకుండా పడుకునేందుకు ట్రై చేశాడు. కానీ ఏనుగు మాత్రం అస్సలు తగ్గలేదు. పరుపుపై పడుకొనేందుకు శతవిధాలా ప్రయత్నించింది. జూకీపర్‌ను కాలితో తన్నేందుకు ట్రై చేస్తుంది. ఇక పిల్ల ఏనుగు పోరు భరించలేక చివరకు దాంతో పరుపును పంచుకోవాలని జూ కీపర్ ఫిక్స్‌ అవుతాడు. దానిపక్కనే పడుకుని..కౌగిలించుకుంటూ.. పడుకుంటాడు. మనుషులు, జంతువుల మధ్య ఉండే స్నేహాన్ని బాగా చూపించే ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ ఏనుగు కాలితో తన్నింది కాబట్టి సరిపోయింది. అదే మీద కూర్చొని ఉంటే ఆ జూ కీపర్‌ పరిస్థితేంటి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోన్న ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయ్యండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

IPL 2022: ఈ 9 కోట్ల ఆటగాడు 16 కోట్ల స్టార్ ప్లేయర్ రికార్డును సమం చేశాడు..

Karate Kalyani: కావాలనే కొందరు నాపై కుట్ర పన్నుతున్నారు.. నన్ను బద్నాం చేసేందుకే ఈ వివాదాలు: కరాటే కల్యాణి

TISS Mumbai 2022: నెలకు రూ.42000లజీతంతో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు..దరఖాస్తుకు రేపే ఆఖరు..