Viral Video: చెల్లెలి మొదటి అడుగులు చూసిన అన్నయ్య స్పందన.. అద్భుతమైన వీడియోకి నెటిజన్లు ఫిదా..!

నిలబడలేకపోయినప్పటికీ మెల్లిగా లేచి ఆమె తన మొదటి అడుగును వేసింది. ఇది ఆ అన్నయ్యని సంతోషంతో ఆశ్చర్యపోయేలా చేసింది.

Viral Video: చెల్లెలి మొదటి అడుగులు చూసిన అన్నయ్య స్పందన.. అద్భుతమైన వీడియోకి నెటిజన్లు ఫిదా..!
First Steps

Updated on: Aug 30, 2022 | 12:24 PM

Viral Video: ఆ అన్నయ్య తన చెల్లెలి మొదటి అడుగులు వేయడాన్ని చూస్తాడు. దానికి అతడు స్పందించిన తీరు నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్‌గా మారింది.ఈ వీడియోకు విపరితంగా వ్యూస్‌, కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ వీడియోలో ఏముందంటే..

ఒక అన్నయ్య, అతని చిన్న చెల్లెలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను మొదటిసారి ఆమె నడకను చూసి నిజంగా ఆశ్చర్యపోయాడు. అతను ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. వీడియో నిజంగా ఓ సంతోషకర, ఆశ్చర్యకరమైన అద్భుత క్షణాన్ని క్యాప్చర్‌ చేసింది. ఈ వీడియోని ఇప్పటివరకు 20వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఆ అన్న చెల్లెలి అనుబంధం ఎవరూ వివరించలేనిదిగా ఈ వీడియో రుజువు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో చిన్న అమ్మాయి లేచి నడవడం ప్రారంభించింది. ఆమె నిలబడలేకపోయినప్పటికీ మెల్లిగా లేచి ఆమె తన మొదటి అడుగును వేసింది. ఇది ఆ అన్నయ్యని సంతోషంతో ఆశ్చర్యపోయేలా చేసింది. తన చెల్లెలు మొదటిసారి నడవడం చూసి అతను ఎలా భావించాడో పసివాడి మాటాల్లో చాలా చక్కగా చెబుతూ వివరించాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి