Watch: వింతల్లో ఇదో వింత..! తలపై ఈఫిల్ టవర్ కట్టిన హెయిర్‌స్టైలిస్ట్‌.. నైపుణ్యానికి ఫిదా అవ్వాల్సిందే..!

|

Jul 12, 2024 | 9:20 PM

మరో యువతి తలపై గోధుమ రంగు బుట్టను తయారు చేసి, ఆ బుట్టలో పైనాపిల్, ద్రాక్షతో సహా వివిధ రకాల పండ్లు, కూరగాయలను ఉంచింది. ఆ బుట్టలోంచి స్ట్రాబెర్రీ పండ్లను తీసుకుని తింటున్నారు కూడా. ఇలాంటి వింత, విచిత్రమైన, హెయిర్ స్టైలింగ్ వీడియో ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయగా, వీడియో పోస్ట్ చేసిన వెంటనే అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను

Watch: వింతల్లో ఇదో వింత..! తలపై ఈఫిల్ టవర్ కట్టిన హెయిర్‌స్టైలిస్ట్‌.. నైపుణ్యానికి ఫిదా అవ్వాల్సిందే..!
Eiffel Tower In Head
Follow us on

చాలా మంది మహిళలు పార్టీకి వెళ్లినా, పెళ్లికి వెళ్లే ముందు మేకప్ తప్పనిసరి. మేకప్‌ లేకుండా ఆడవాళ్లు ఇంటి నుంచి బయటకు రారు. ఇందులో చాలా చోట్ల హెయిర్ స్టైలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక్క విషయం మొత్తం రూపాన్ని మార్చగలదు. మనం తరచుగా సోషల్ మీడియా ఇందుకు సంబంధించి అనేక ఉదాహరణలను చూస్తుంటాం. ఇక్కడే హెయిర్ స్టైలిస్ట్‌లు తమ వివిధ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. దానితో ఆకట్టుకున్న చాలా మంది వ్యక్తులు తమ ప్రత్యేకమైన రోజు కోసం తమకు ఇష్టమైన, నచ్చిన హెయిర్ స్టైలిస్ట్‌ను బుక్ చేసుకుంటారు. ఈసారి, ఒక హెయిర్ స్టైలిస్ట్ చేసిన అద్భుతం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. అది బన్నో, పోనీ టైల్‌నో కాదు, ఈ హెయిర్‌స్టైల్‌తో తలపై ఏకంగా ఈఫిల్ టవర్నే కట్టేశారు. ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

వైరల్ వీడియోలో ఒక యువతి తన నెరిసిన జుట్టుకు హెయిర్‌ స్టైల్ చేయించుకుంటోంది. ముందుగా ఆ మహిళ తలపై పోనీ టెయిల్ వేసింది హెయిర్‌ స్టైలిస్ట్‌. ఆ తర్వాత రకరకాల క్రాఫ్ట్స్ చేస్తున్నారు. ఆ తరువాత రకరకాలుగా అల్లుతూ..ఏదో ప్రాజెక్ట్‌ డిజైన్‌ చేస్తున్నట్టుగా చేసింది. ఇదంతా చూస్తున్న నెటిజన్లు ఎలాంటి హెయిర్‌స్టైల్ చేయబోతుందో చూసేందుకు స్క్రీన్‌పై నుంచి కళ్లు తిప్పకుండా చూస్తున్నారు. ఈలోగా వీడియో సాగుతున్నా కొద్దీ కొత్త విషయాలు ఒక్కొక్కటిగా చేరిపోతున్నాయి. వీడియో చివరలో హెయిర్ స్టైలిస్ట్ ఆ యువతి తలపై మొత్తం ఈఫిల్ టవర్‌ను నిర్మించేసింది. ప్యారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్‌ను యువతి తలపై చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అంతేకాదు.. వీడియోలోని హెయిర్ స్టైలిస్ట్ నైపుణ్యం మామూలుగా లేదు.. మరో యువతికి హెయిర్‌ స్టైల్‌ చేస్తూ.. తలపై ఫ్రూట్‌ బాస్కెట్‌ ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి

మరో యువతి తలపై గోధుమ రంగు బుట్టను తయారు చేసి, ఆ బుట్టలో పైనాపిల్, ద్రాక్షతో సహా వివిధ రకాల పండ్లు, కూరగాయలను ఉంచింది. ఆ బుట్టలోంచి స్ట్రాబెర్రీ పండ్లను తీసుకుని తింటున్నారు కూడా. ఇలాంటి వింత, విచిత్రమైన, హెయిర్ స్టైలింగ్ వీడియో ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయగా, వీడియో పోస్ట్ చేసిన వెంటనే అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. లైక్‌లు దాదాపు 35 వేలకు చేరువలో ఉన్నాయి. కామెంట్ సెక్షన్ అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలతో నిండిపోయింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..