AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘మేరా దిల్ యే పుకారా’ పాటకు స్టెప్పులేసిన అమితాబ్..? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

ఐషా అనే పాకిస్థాన్ అమ్మాయి తన అందమైన స్టెప్పులతో నెట్టింట పోస్ట్ చేసినప్పటి నుంచి ‘మేరా దిల్ యే పుకారే ఆజా’ పాట సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఆ క్రమంలోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా డ్యాన్స్ వేసినట్లుగా..

Viral Video: ‘మేరా దిల్ యే పుకారా’ పాటకు స్టెప్పులేసిన అమితాబ్..? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Amitabh Dance On Mera Dil Ye Pukara Song
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 22, 2022 | 2:19 PM

Share

ఐషా అనే పాకిస్థాన్ అమ్మాయి తన అందమైన స్టెప్పులతో నెట్టింట పోస్ట్ చేసినప్పటి నుంచి ‘మేరా దిల్ యే పుకారే ఆజా’ పాట సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ పాట నెటిజన్లలో పిచ్చెక్కించేసింది. ఇక సాధారణ నెటిజన్ల నుంచి బాలీవుడ్ తారల వరకు ఇంకా చెప్పుకుంటూ పోతే దేశ భద్రతాదళాలకు కూడా ఈ పాట వ్యాపించింది. కొన్ని రోజుల క్రితం బీఎస్ఎఫ్ మహిళా సిబ్బంది కూడా ఈ పాటకు డ్యాన్స్ వేసిన వీడియోను మనం చూశాం. ఆ క్రమంలోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా డ్యాన్స్ వేసినట్లుగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. నిజానికి ఈ వీడియో ఎడిట్ చేసిన మీమ్ అయినప్పటికీ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది.

manojchauhan70_ అనే ఇన్‌స్టా ఖాతా నుంచి విడుదలయిన ఈ వీడియోను ఇప్పటివరకు 13 లక్షల 55 వేల మంది లైక్ చేశారు. అంతేకాక ఏకంగా కోటీ 60 లక్షలకు పైగా వీక్షణలు కూడా వచ్చాయి. ఆ క్రమంలోనే నెటిజన్లు తమ తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో మనం సూర్యవంశం(బాలీవుడ్) లో అమితాబ్ బచ్చన్ వేసిన డ్యాన్స్‌ను చూడవచ్చు. అలాగే వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో మేరా దిల్ యే పుకారా పాట వినిపించడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈ వీడియోను చూసినవారు నవ్వకుండా ఉండలేరు. ఇక ఈ వీడియోను ఎవరు ఎడిట్ చేశారో తెలియదు కానీ అమిత్.ఇన్ అనే ట్విట్టర్ మీమ్ పేజ్ నుంచి విడుదలయినట్లుగా కూడా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

View this post on Instagram

A post shared by ?????? (@manojchauhan70_)

కాగా ‘మేరా దిల్ యే పుకారే ఆజా’ అనేది 1954లో వైజయంతి మాలా, ప్రదీప్ కుమార్ నటించిన నాగిన్ చిత్రంలోని పాట. దీనిని దివంగత గాయని లతా మంగేష్కర్ పాడారు. అయితే కొన్ని వారల క్రితం ఈ పాటకు పాకిస్థానీ అమ్మాయి ఐషా తన డ్యాన్స్ స్టైల్, సింపుల్ లుక్స్‌తో తిరగి ప్రాణం పోసింది. దీంతో ఈ పాటను నెటిజన్లు వైరల్ చేసేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..