CDS Bipin Rawat Old Video Goes Viral: భారత సైన్యంలో (Indina Army) కొత్త రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ (Agnipath) పథకంపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. అగ్నిపథ్ పథకంపై కొనసాగుతున్న నిరసనలు అనేక రాష్ట్రాల్లో హింసాత్మకంగా కూడా మారాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పథకానికి వ్యతిరేకంగా విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అగ్నిపథ్ ప్లాన్‌కు సంబంధించి ఆదివారం త్రివిధ సైన్యాలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఇందులో యువతకు ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ గందరగోళం మధ్య.. దివంగత CDS బిపిన్ రావత్ పాత ప్రసంగం వైరల్ అవుతోంది.. ఈ వీడియో నిరసనకారులు చూస్తే.. సైన్యం అంటే ఏమిటో అర్థం అవుతుంది.
ఈ వీడియో డిసెంబర్ 13, 2018 నాటిది అయితే ఈ వీడియో నేటి సగటు యువత పనితీరుని కరెక్ట్ గా జడ్జ్ చేస్తుంది. ఈ వీడియో పాతదే కావచ్చు .. కానీ స్వర్గీయ బిపిన్ రావత్ సైన్యం గురించి.. చెప్పింది వింటే.. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉద్వేగానికి లోనవుతారు.. ఎందుకంటే నేటి యువత సైన్యాన్ని ఉద్యోగంగా పరిగణించకూడదని ఆయన స్పష్టంగా చెప్పారు..!
Jai Hind. The #AgnipathScheme was the Brainchild of former CDS Gen Bipin Rawat#GeneralBipinRawat wanted to transform the Indian Fources into a boon for the Entire Nation, — before participating on #BharatBandh … Youngsters must Listen what CDS Gen Rawat said in Pune ,2018. pic.twitter.com/oFXo5dTAbu
— Arjun Inaniyan (@arjun_inaniyan) June 20, 2022
మీరు దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరాలంటే శారీరకంగా, మానసికంగా, అన్ని విధాలుగా సత్తా చూపాలని దివంగత సిడిఎస్ బిపిన్ రావత్ చెప్పడం వీడియోలో మీరు చూడవచ్చు. మీ ఆత్మ నిర్భరాన్ని కలిగి ఉండాలి. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. దారి లేని చోట దారి వెతుక్కోగల సామర్థ్యం ఉండాలి. మీలో ఈ లక్షణాలన్నీ ఉంటేనే.. మీరు నిజమైన.. భారత సైన్యానికి సారథులు అని పిలుస్తారు. అంతేకాదు.. ఎవరైనా ఉద్యోగం చేయాలనుకుంటే.. రైల్వేకు వెళ్లండి లేదా మరేదైనా ఉద్యోగం చేయండి.. లేదా ఏదైనా వ్యాపారం చేయండి అని రావత్ చెప్పారు. కానీ సైన్యాన్ని ఉపాధి మార్గంగా పరిగణించి.. భారత ఆర్మీల ఉద్యోగాన్ని ఎంచుకోవద్దు.. ఇది దేశ రక్షణ కోసం చేస్తున్న యజ్ఞంగా భావించి పవిత్ర వృత్తిని ఎంచుకోండి అని దేశ యువతకు దిశానిర్ధేశం చేశారు..
ఈ వీడియోను @arjun_inaniyan ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో తప్పని సరిగా నిరసనకారులు చూడాలంటూ నెటిజన్లు ఏకముక్తంగా కామెంట్ చేస్తున్నారు..
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..