AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వార్నీ..ఈ బాతు ఎంత దొంగదంటే.. ఏకంగా సూపర్ మార్కెట్‌కు కన్నం వేసింది.. కట్‌చేస్తే..

వైరల్ వీడియోలో ఒక బాతు సూపర్ మార్కెట్ నుండి హాట్ డాగ్‌తో పారిపోవడం చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. వీడియో వారు ఎవరూ మొదట నవ్వకుండా ఉండలేకపోయారు.. కానీ అసలు కారణం చూసినప్పుడు అందరూ విస్తూపోయారు. వీడియో చూస్తే మీరు కూడా నోట మాట రాక మౌనంగా ఉండిపోతారు. కన్నీళ్లు పెట్టించే ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వేగంగా వైరల్‌ అవుతోంది.

Viral Video: వార్నీ..ఈ బాతు ఎంత దొంగదంటే.. ఏకంగా సూపర్ మార్కెట్‌కు కన్నం వేసింది.. కట్‌చేస్తే..
Duck Steals
Jyothi Gadda
|

Updated on: Oct 07, 2025 | 6:39 PM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతాయి. కానీ కొన్ని వీడియోలు నిజంగా ప్రజల హృదయాల్ని తాకుతాయి. మనిషి అయినా, జంతువు అయినా, తల్లి తన పిల్లల పట్ల చూపే ప్రేమ, త్యాగాన్ని చూసినప్పుడు అందరి కళ్లు చెమ్మగిల్లితాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. అందులో ఒక బాతు సూపర్ మార్కెట్ నుండి హాట్ డాగ్‌తో పారిపోవడం చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. వీడియో వారు ఎవరూ మొదట నవ్వకుండా ఉండలేకపోయారు.. కానీ అసలు కారణం చూసినప్పుడు అందరూ విస్తూపోయారు. వీడియో చూస్తే మీరు కూడా నోట మాట రాక మౌనంగా ఉండిపోతారు. కన్నీళ్లు పెట్టించే ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వేగంగా వైరల్‌ అవుతోంది.

వైరల్ వీడియోలో ఒక సూపర్ మార్కెట్ లోపల అకస్మాత్తుగా ఒక బాతు కనిపిస్తుంది. అది నేరుగా ఫుడ్ సెక్షన్ వైపు వెళ్లి హాట్ డాగ్‌లలో ఒకదాన్ని పట్టుకుంటుంది. దాని ప్రవర్తన ఏదో దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న మనిషిలాగే ఉంటుంది. పట్టుబడతామేమోనని భయపడి అది వేగంగా అడుగులు వేస్తుంది. బాతు త్వరగా తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అది కౌంటర్‌ను ఢీకొట్టి పడిపోతుంది. అయితే, పడిపోయిన బాతు వెంటనే లేచి పారిపోతుంది. చివరికి దుకాణం నుండి బయటపడింది. ఆ తరువాత ఏం జరిగిందో ఎవరూ ఊహించలేరు.

ఇవి కూడా చదవండి

తరువాత వీడియోలో అత్యంత భావోద్వేగ దృశ్యం కనిపిస్తుంది. బాతు బయటకు వెళ్లి హాట్ డాగ్‌ను తన పిల్లలకు అందజేస్తుంది. చిన్న బాతు పిల్లలు సంతోషంగా ఆహారాన్ని తింటాయి. ఆ దృశ్యం ప్రేక్షకుల హృదయాలను కరిగించింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లక్షలాది మంది వీక్షించారు. ప్రతి ఒక్కరూ తల్లి ప్రేమ, త్యాగాన్ని ప్రశంసిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

@cloud1a7 అనే ఖాతా ద్వారా ఈ వీడియోని షేర్‌ చేయగా, ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు. చాలామంది దీన్ని ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా రాశారు, తల్లి ఎవరికైనా తల్లే అంటూ రాశారు. కానీ ఇది AI తల్లిలా కనిపిస్తుందని అంటున్నారు. మరొక వినియోగదారు ఇలా రాశారు, మనిషి అయినా, పక్షి అయినా, ఎవరైనా తమ కుటుంబం కోసం ఏదైనా చేస్తారని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..