Viral News: వర్కర్‌కు ఊహించని షాకిచ్చిన యజమాని.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

| Edited By: Anil kumar poka

Sep 23, 2021 | 5:07 PM

Viral News: ఉద్యోగం చేస్తున్న ప్రతీ వ్యక్తి నెలాఖరున వచ్చే జీతం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు. ఏ క్షణమైతే సాలరీ తమ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందో..

Viral News: వర్కర్‌కు ఊహించని షాకిచ్చిన యజమాని.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!
Salary
Follow us on

ఉద్యోగం చేస్తున్న ప్రతీ వ్యక్తి నెలాఖరున వచ్చే జీతం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు. ఏ క్షణమైతే సాలరీ తమ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందో.. అప్పుడే ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. నెల రోజులు కష్టాన్ని మర్చిపోడానికి ఆ చిరునవ్వు చాలు. అయితే ఐర్లాండ్‌లోని ఒక రెస్టారెంట్ ఉద్యోగి మాత్రం నెలాఖరున యజమాని ఇచ్చిన తన జీతాన్ని చూసి ఖంగుతిన్నాడు. ఆ రెస్టారెంట్ యజమాని అతడికి జీతాన్ని నాణేల రూపంలో ఇచ్చాడు. నెలాఖరున జీతం కింద సుమారు 29.8 కేజీల బకెట్ నిండా 5 సెంట్ల నాణేలను సాలరీగా వర్కర్ తీసుకున్నాడు. దీనితో అతడి నోరెళ్లబెట్టాడు. అసలు ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రియాన్ కియోగ్ అనే వ్యక్తి ఐర్లాండ్‌లోని సౌత్ విలియం స్ట్రీట్‌లోని ఆల్ఫీస్‌ రెస్టారెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ రెస్టారెంట్‌లో అతడికి అదే చివరి నెల. నెలాఖరున జీతం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశాడు. అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్ అవుతాయని అనుకున్న అతడికి.. యజమాని 5 సెంట్ల నాణేలతో నిండిన ఓ బకెట్‌ను చేతిలో పెట్టాడు. దీనితో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంకేముంది తనకు ఎదురైన ఈ విచిత్ర పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. ”సౌత్ విలియం స్ట్రీట్‌లోని ఆల్ఫీస్‌లో పని చేయడం ఎలా ఉంటుందో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే, వారాల తరబడి జీతం కోసం ఎదురుచూసిన నా రెమ్యూనరేషన్ నాకు లభించిందంటూ నాణేలతో నిండిన బకెట్‌” ఫోటోలను షేర్ చేశాడు. రియాన్ చేసిన ట్వీట్‌కు 14 వేలకు పైగా లైక్‌లు 1800కి పైగా రీట్వీట్‌లు వచ్చాయి.

కాగా, ఇది మాత్రమే కాదు.. తన యజమానితో చేసిన చాట్‌ను కూడా రియాన్ స్క్రీన్‌షాట్‌ల రూపంలో షేర్ చేశాడు. అందులో సెప్టెంబర్ 9న, రియాన్ రెస్టారెంట్ యజమానికి తన జీతం అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందా.. లేదా చెక్ ఇస్తారా.? అని అడిగినట్లు మీరు చూడవచ్చు. దానికి బదులుగా యజమాని.. మంగళవారం నీకు నగదు రూపంలో జీతం ఇస్తా సరేనా.? అని అడిగాడు. డబ్బు చాలా అవసరం ఉన్నందున రియాన్‌ దానికి అంగీకరించాడు. అయితే యజమాని ఇలా బకెట్ నిండా నాణేలు ఇస్తాడని మాత్రం ఊహించలేదు. ఇక ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!