Watch: మందు బాబులం మేము మందుబాబులం.. నడిరోడ్డుపై తాగుబోతు భరతనాట్యం..!

|

Jun 19, 2023 | 9:19 PM

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ముందు ఆ తాగుబోతు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. మద్యం మత్తులో సామీ..సామీ పాటకు భరతనాట్యం చేశాడు. అంతటితో ఆగలేదు అతడు.. ఆ మార్గంలో వచ్చే పోయే ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయటం మొదలుపెట్టాడు. అతడు చేసే పనులతో వాహనదారులు, బాటసారులు ఆందోళనకు గురయ్యారు.

Watch: మందు బాబులం మేము మందుబాబులం.. నడిరోడ్డుపై తాగుబోతు భరతనాట్యం..!
Drunken Man
Follow us on

ధూమపానం, మద్యం ఆరోగ్యానికి హానికరం అని వాటిపైనే రాసి ఉంటుంది. అయినప్పటికీ విక్రయాలు మాత్రం తగ్గటం లేదు. మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆల్కహాల్ తాగడం వల్ల అనేక ఇబ్బందులు తప్పవు. అది ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, కుటుంబ పరంగా కూడా నష్టాలు, కష్టాలు తప్పవు. అంతేకాదు.. తాగిన మైకంలో కొందరు చేసే దుర్మార్గం పనులు, సామాజిక నేరాలకు పాల్పడుతుంటారు. అలాంటి వారిని ప్రజలందరూ అసహ్యించుకుంటారు. ఇది అంతటితో ఆగిపోదు.. అతిగా తాగిన వారికి శారీరక రుగ్మతలను ఎదుర్కొంటూ ఆసుపత్రి మెట్లెక్కాల్సి వస్తుంది. ఇది కుటుంబ సభ్యులు, వారి ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. దీనిపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. అనుభవం ద్వారా తెలుసుకున్నవారు ఎందరో ఉన్నారు. మద్యం మత్తులో నడిరోడ్డుపై ఒక తాగుబోతు చేసిన వీరంగం వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దాంతో వీడియో వైరల్‌ గా మారింది.

వైరల్‌ వీడియోలో జరిగిన ఘటన తమిళనాడుకు చెందినది సమాచారం. నమక్కల్ జిల్లా కుమారపాళయంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై భరతనాట్యం చేస్తూ హల్‌చల్‌ చేశారు. రోడ్డుపై వాహనాలకు అడ్డుగా వెళ్తూ మత్తులో ఊగిపోతూ భరతనాట్యం స్టెప్పులు వేశాడు. తాగిన మైకంలో ఒళ్లు తెలియక ప్రజలకు ఇబ్బంది కలిగించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

కుమారపాళయంలోని సేలం వెళ్లే రోడ్డులో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ముందు ఆ తాగుబోతు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. మద్యం మత్తులో సామీ..సామీ పాటకు భరతనాట్యం చేశాడు. అంతటితో ఆగలేదు అతడు.. ఆ మార్గంలో వచ్చే పోయే ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయటం మొదలుపెట్టాడు. అతడు చేసే పనులతో వాహనదారులు, బాటసారులు ఆందోళనకు గురయ్యారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని అటుగా వెళ్తున్న ప్రజలు కూడా పట్టుబట్టారు. ఈ ప్రాంతంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని ప్రజలు డిమాండ్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..