AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌పోర్టులో పాముల కలకలం.. లాంజ్‌లో విషసర్పాలు!

విమానాల రాకపోకలు, ప్రయాణికుల హడావుడితో సందడిగా ఉండే విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. ఆస్ట్రేలియాలోని ఓ విమానాశ్రయం టెర్మినల్‌లో, ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాల్లో, సిబ్బంది కార్యాలయాల్లో, చివరికి ఎయిర్‌లైన్‌ లాంజ్‌లోనూ పాములు కనిపించడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వాటిలో అత్యంత విషపూరితమైన పాములు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఎయిర్‌పోర్టులో పాముల కలకలం.. లాంజ్‌లో విషసర్పాలు!
Dozens Of Venomous Snakes Inside Australia Airport
Sharada V
|

Updated on: Oct 19, 2026 | 10:11 AM

Share

విమానాల రాకపోకలు, ప్రయాణికుల హడావుడితో సందడిగా ఉండే విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. ఆస్ట్రేలియాలోని ఓ విమానాశ్రయం టెర్మినల్‌లో, ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాల్లో, సిబ్బంది కార్యాలయాల్లో, చివరికి ఎయిర్‌లైన్‌ లాంజ్‌లోనూ పాములు కనిపించడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వాటిలో అత్యంత విషపూరితమైన పాములు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఆలిస్ స్ప్రింగ్స్ లో పాముల సంచారం!

ఆలిస్ స్ప్రింగ్స్ విమానాశ్రయంలోని ప్రవేశ ద్వారాలు, ప్రయాణికులు చెక్‌ఇన్ చేసే ప్రాంతాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పాములు కనిపించాయి. స్నేక్‌ క్యాచర్‌ రెక్స్ నైండార్ఫ్ తన బృందంతో కలిసి విమానాశ్రయంలో పలు చోట్ల పాములను పట్టుకున్నారు. విమానాశ్రయ టెర్మినల్‌లో రెండు వెస్టర్న్‌ బ్రౌన్ పాములను బంధించినట్లు రెక్స్ నైండర్ఫ్ తెలిపారు. వీటిలో ఒకటి ప్రయాణికులు తిరిగే ప్రాంతంలో, మరొకటి విమానాశ్రయ ఉద్యోగులు ఉన్న కార్యాలయంలో కనిపించింది. వెస్టర్న్‌ బ్రౌన్ పాములు అత్యంత విషపూరితమైనవి. వీటి దగ్గరకు వెళ్లడం లేదా వాటిని కదిలించేందుకు ప్రయత్నించడం ప్రాణానికే ప్రమాదం. వీటితో పాటు  విప్ స్నేక్స్ ను కూడా చాకచక్యంగా పట్టుకున్నారు. ఇవి వెస్టర్న్‌ బ్రౌన్ పాములతో పోలిస్తే తక్కువ ప్రమాదకరమైనవి.

ఎయిర్‌పోర్టులోకి పాములు ఎందుకు వచ్చాయి?

ఉత్తర ఆస్ట్రేలియాలోని ఎడారి ప్రాంతంలో  వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు, పాములు చురుగ్గా మారతాయి. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి చల్లని ప్రదేశాలు, నీడ ఉన్న ప్రాంతాలలో ఆశ్రయం పొందుతాయి. ఆలిస్ స్ప్రింగ్స్  విమానాశ్రయ భవనంలో దాక్కోవడానికి అనువైన మూలలు ఉండటంతో పాములు అక్కడికి చేరుకుని ఉంటాయని భావిస్తున్నారు.

పాము కనిపిస్తే ఏం చేయాలి?

ఆలిస్ స్ప్రింగ్స్ విమానాశ్రయంతో పాటు డార్విన్, టెన్నంట్ క్రీక్ విమానాశ్రయాలలో నిఘా పెంచింది ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ గ్రూప్ (ADG).  పాములు కనిపిస్తే ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. పాము కనిపించినప్పుడు ఎలా స్పందించాలి? వాటి నుంచి ఎదురయ్యే ప్రమాదాలపై విమానాశ్రయ ఉద్యోగులకు రెక్స్ నైండర్ఫ్ శిక్షణ ఇచ్చారు. పాము కనిపిస్తే స్వయంగా పట్టుకోవడానికి, మరో చోటుకు తరలించేందుకు లేదా తరమడానికి ప్రయత్నించకూడదు. పాము వెళ్లే దారిని అడ్డుకోవడం ప్రమాదకరం.  వెంటనే అక్కడి సిబ్బందికి సమాచారం అందించాలి. ఇతరులు పాము దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు.

ఆస్ట్రేలియాలోని ఎడారి ప్రాంతంలో ఉన్న ఆలిస్ స్ప్రింగ్స్ విమానాశ్రయానికి పాముల సంచారం కొత్త సమస్య కాదు. వేసవి వేడి పెరుగుతున్న కొద్దీ ఈ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రతకు భంగం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విమానాశ్రయంలో ఎక్కడ చూసినా పాములు కనిపిస్తున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నా.. ఇప్పటివరకు పాముకాటు ఘటనలు నమోదు కాలేదు.

Follow Us