Viral Video: ఐకమత్యం బలం అంటే ఇది.. పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు షాకింగ్ వీడియో వైరల్

|

Jul 08, 2023 | 11:15 AM

వైరల్ వీడియోలో ఒక కుక్క తన నోటిలో ఒక పాముని పట్టుకుని పొదలు వెనుక నుండి ఒక పామును తీసుకువచ్చి తన తోటి కుక్కల మధ్యలో వదిలివేసింది. ఈ సమయంలో పాము మొదట తన ప్రాణాలను రక్షించుకోవడానికి కుక్కలను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. తరువాత ఆ కుక్కల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది

Viral Video: ఐకమత్యం బలం అంటే ఇది.. పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు షాకింగ్ వీడియో వైరల్
Viral Video
Follow us on

కుక్కలు మానవులకు స్నేహితులుగా పరిగణించబడుతున్నాయి. కుక్క విశ్వాసం,విధేయత గురించి అనేక కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అయితే కొన్నిసార్లు అవి మానవులకు శత్రువులుగా కూడా మారతాయి. కుక్కలు మనుషులను కరిచి గాయపరిచడంతో కొంతమంది పరిస్థితి విషమించడమే కాదు  ఆసుపత్రిలో జీవన్మరణ మధ్య ఊగిసలాడడం వంటి సంఘటనలు ఎన్నో చూసి ఉంటారు. విని ఉంటారు.  ప్రస్తుతం కుక్కలకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో కుక్కలు పామును కరిచి చంపేశాయి.

వైరల్ వీడియోలో ఒక కుక్క తన నోటిలో ఒక పాముని పట్టుకుని పొదలు వెనుక నుండి ఒక పామును తీసుకువచ్చి తన తోటి కుక్కల మధ్యలో వదిలివేసింది. ఈ సమయంలో పాము మొదట తన ప్రాణాలను రక్షించుకోవడానికి కుక్కలను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. తరువాత ఆ కుక్కల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే అది జరగలేదు. కుక్కలు పాముని బాగా ఇబ్బంది పెట్టాయి. కొన్ని కుక్కలు పాము  తోకను పట్టుకుని కొరుకుతున్నాయి. మరికొన్ని తమ నోటితో పాముని పట్టుకుని కోరుకుంటున్నాయి. ఇంతలో, ఒక పెద్ద కుక్క పామును తీవ్రంగా కరిచింది. కుక్కలతో పోరాడి పోరాడి, పారిపోవడానికి ప్రయత్నించి చివరకు  పాము చనిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ilhanatalay అనే IDతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.  ఇది ఇప్పటివరకు 14 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకోగా.. 5 లక్షల మందికి పైగా లైక్ చేసారు.

ఈ మొత్తం ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బారి నుంచి పామును కాపాడి ఉండాల్సిందని.. అంతేకాని దారుణంగా పాముని తరిమి తరిమి చంపుతుంటే వినోదంగా చూస్తూ వీడియో తీయడం కరెక్ట్ కాదని అంటున్నారు. అదే సమయంలో కొంతమంది కుక్కలన్నీ కలిసి పాముని ఎదుర్కొన్న తీరు.. ఐక్యతలో బలం తెలియజేయడానికి ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..