Viral Video: ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పనిచేస్తున్న కుక్క..! పెద్ద జీతంతో పాటుగా..వైరల్‌ వీడియో

|

May 30, 2022 | 10:59 AM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యోగాల కొరత వేధిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మంచి జీతంతో కూడిన ఉద్యోగం కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాల కోసం అభ్యర్థులు పోరాడుతున్న పలు వీడియోలు కూడా నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇలాంటి టైమ్‌లో ఓ వీడియో

Viral Video: ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పనిచేస్తున్న కుక్క..! పెద్ద జీతంతో పాటుగా..వైరల్‌ వీడియో
Dog Working
Follow us on

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యోగాల కొరత వేధిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మంచి జీతంతో కూడిన ఉద్యోగం కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాల కోసం అభ్యర్థులు పోరాడుతున్న పలు వీడియోలు కూడా నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇలాంటి టైమ్‌లో ఓ వీడియో సోషల్‌ మీడియాలో చేరి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ కుక్క ఫైవ్ స్టార్ హోటల్‌లో పనిచేస్తుంది. అందుకు సంబంధించి ఆ శునకం తన ఐడి కార్డును కూడా మెడలో వేసుకుని డ్యూటీ చేస్తోంది. అంతేకాదు, ఇతర ఉద్యోగులతో సమానమైన వేతనం కూడా ఈ కుక్క తీసుకుంటోంది. తోటి ఉద్యోగులు కూడా ఈ శునకాన్ని ఎంతగానో ప్రేమిస్తారట. ఇది చదువుతుంటే..మీకు వింతగా అనిపించినప్పటికీ…ఇదంతా నిజమేనండోయ్‌..

ఈ కుక్క పేరు “బర్నీ ది లలిత్ అశోక్” అని తెలిసింది. ఈ నేపథ్యంలో, హోటల్ జనరల్ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కుక్క హోటల్‌లో “చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్”గా పనిచేసింది. అంతేకాదు ఇప్పుడు లాబీ మీటింగ్స్‌తో పాటు ఇతరాత్ర వాటిల్లోననూ పాల్గొంటుంది. ప్రతి ఒక్కరూ బర్నీ లలిత్ అశోక్‌ను అప్యాయంగా చూసుకుంటారు. ఎంతో ప్రేమను పంచుతారు.. హోటల్‌లో ఉన్న అతిథులను, ఉద్యోగులను ఆ కుక్క నవ్వించేదని తెలిసింది. అదనంగా, హోటల్ అతిథులు దాంతో నడవడానికి, తినడానికి, ప్రయాణించడానికి పోటీ పడుతుండేవారట.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో “తెలలిత్ బెంగళూరు” అనే ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు వేలమందికి పైగా వీక్షించారు. ఇదిలా ఉండగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రెస్పాన్స్‌లు ఇస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మనసును కదిలించే వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది.