కుక్కలు విశ్వాసపాత్రమైనవి. వాటి విధేయతకు ఉదాహరణలు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేకం చూశాం. ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు తమ యజమానుల పట్ల ప్రేమను చూపిస్తాయి. ఇంట్లో వారితో అల్లరిగా ఆడుకుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి మనల్ని ఆపద నుంచి రక్షిస్తాయి. యజమానుల కోసం ఆపదను కూడా లెక్క చేయకుండా ప్రాణాలను కూడా అర్పిస్తుంటాయి. కానీ, ఇక్కడ మాత్రం కుక్కలు ఆడుకుంటుండగా ఓ ఇంటికి నిప్పంటుకుని పెను ప్రమాదం సంభవించింది. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన అమెరికాలోని ఓక్లహోమాకు చెందినదిగా తెలిసింది. ఓక్లహోమా అగ్నిమాపక విభాగం ద్వారా ఈ వీడియో షేర్ చేయబడింది. వీడియోలో కొన్ని కుక్కలు ఆ ఇంటికి నిప్పంటించినట్లుగా కనిపిస్తుంది. అక్కడ చాలా కుక్కలు ఉన్నాయి. అవన్నీ ఆడుకుంటున్నాయి. కానీ, ఉన్నట్టుండి ఒక కుక్క నోటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ కుక్కలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. సంఘటన జరిగినప్పుడు, ఇంట్లో రెండు కుక్కలు, ఒక పిల్లి ఉన్నాయి. ఇంటి యజమాని ఎక్కడో దూరంగా ఉన్నట్టుగా తెలిసింది.
అయితే, ఆ కుక్క నోటిలో లిథియం-అయాన్ బ్యాటరీ ఉందని తెలిసింది. దానిని ఆ కుక్క నమలుతుండగా ప్రమాదం జరిగింది. బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చాలా సేపటి నుండి ఆ కుక్క బ్యాటరీని నములుతూ ఉండగా, ఒక్కసారిగా స్పార్క్ బయటకు వచ్చింది. దాంతో ఆ మూడు కుక్కలు అక్కడ్నుంచి పరుగులు ప్రారంభించాయి. కుక్క బ్యాటరీతో పరుపుపై కూర్చోగా, ఆ పరుపుకు కూడా మంటలు అంటుకున్నాయి. కొంతసేపటికి మంటలు చెలరేగడంతో పరుపు మొత్తం కాలి బూడిదైంది. జరిగిన ప్రమాదంతో ఆ ఇంటికి ఎంత నష్టం వాటిల్లిందన్న దానిపై స్పష్టత లేదు.
NEW: Dog starts a house fire in Tulsa, Oklahoma after chewing through a portable lithium-ion battery.
The Tulsa Fire Department released the following video to warn people about the “dangers of lithium-ion batteries.”
Two dogs and a cat were filmed hanging out before one… pic.twitter.com/skTb8YEzJ6
— Collin Rugg (@CollinRugg) August 6, 2024
ఓక్లహోమా ఫైర్ డిపార్ట్‌మెంట్ మాట్లాడుతూ, ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ వీడియోను షేర్ చేసినట్లు చెప్పారు. ఈ బ్యాటరీలకు సంబంధించిన అనేక అగ్ని ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయని, ఈ బ్యాటరీలను సక్రమంగా నిర్వహించాలని, వాటిని సురక్షితమైన స్థలంలో ఉంచాలని ప్రజలను కోరుతున్నామని డిపార్ట్‌మెంట్ చెబుతోంది. మంటలు చెలరేగడంతో పెంపుడు జంతువులన్నీ ఇంట్లో నుంచి సురక్షితంగా బయటకు వచ్చాయని చెప్పారు. ఆ కుటుంబాన్ని కూడా సురక్షితంగా బయటకు తీశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..