సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతి చిన్న అంశం తెగ వైరల్ అవుతుంది. ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందుకు సంబంధించిన వీడియోస్.. ఫోటోస్ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఆసుపత్రి బేడ్ పై ఓ శునకం హాయిగా నిద్రిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. పేషెంట్స్ ఉండాల్సిన బెడ్ పై కుక్క నిద్రపోతుండడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రత్లామ్ హాస్పిటల్లో జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆందోళనకరమైన ఆరోగ్య వ్యవస్థ నెలకొందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రాష్ట్రంలో ఆసుపత్రిలో డాక్టర్స్ లేకపోవడం.. పేషెంట్స్ ఉండాల్సిన బెడ్స్ పై కుక్కలు నిద్రపోతున్నాయి. ఇదే కదా ఆందోళనకరమైన ఆరోగ్య వ్యవస్థ.. సరైన బెడ్స్ లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
मध्यप्रदेश में भले मरीज़ों को बेड़ मिले या ना मिले लेकिन “श्वान “ तो बेड पर मस्त सोया हुआ है…
तस्वीर रतलाम के अलोट की बतायी जा रही है…
“बदहाल स्वास्थ्य सिस्टम” pic.twitter.com/mhqjdGNiEx
— Narendra Saluja (@NarendraSaluja) September 16, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.